PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాటు సారా తయారీ స్థావరాలపై సెబ్​ ముమ్మర దాడులు

1 min read

– అడిషనల్ ఎస్పీ R.రమణ
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ రఘువీర్ రెడ్డి IPS గారి ఆదేశాలమేరకు నంద్యాల జిల్లా లోని బండిఆత్మకూరు మండలం నెమళ్లకుంట గ్రామం నందుగల అడవి ప్రాంతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB ) మరియు సివిల్ పోలీసులు మరియు ఫారెస్ట్ సిబ్బందితో కలిసి నాటుసారా తయారు చేస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు నాటుసారా తయారు చేసే స్థావరాలపై (భట్టిలపై ) ముమ్మర దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో రెండు నాటు సారా తయారు చేసే బట్టీలను కనుగొని వాటిని ధ్వంసం చేసినారు.ఈ సంధర్భంగా సుమారు (4,000)నాలుగువేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. 50 లీటర్ల నాటిసారాయిని సీజ్ చేయడం జరిగింది.నాటు సారాయి తయారు చేయడానికి ఉపయోగించిన కెమికల్స్ ను,తుమ్మచెక్క, తదితర ముడి పదార్థాలను స్వాదీనంచేసుకిని శాంపిల్ తీసుకోవడం జరిగింది.అనతరం తయారీకి ఉపయోగించు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో నలుగురు వ్యక్తులను గుర్తించడం జరిగిందని వారు పోలీసు వారిని చూసి పారిపోయారని వారిని పట్టుకొనేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (SEB) AES శ్రీధర్ రావ్ గారి ఆద్వర్యంలో ప్రత్యేక బృందం నియమించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ R.రమణ గారు మాట్లాడుతూ నాటుసారాయి తయారీ,రవాణా,విక్రయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాలో ఇప్పటివరకు 16 మందిపై పి.‌డి యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది. నాటు సారాయి తయారీ రవాణా విక్రయం చేసే వారిపై గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు సుమారు 1100 కేసులు పెట్టి దాదాపుగా 3,000 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఎవరైనా నాటు సారాయి తయారుచేసిన రవాణా విక్రయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తద్వారా సంపాదించిన ఆస్తిని కూడా ప్రభుత్వం జప్తు చేసుకుంటుందని అటువంటి వారిపై పి.‌డి యాక్ట్ కూడా ప్రయోగించి జైలుకు పంపించడం జరుగుతుంది హెచ్చరించారు.నాటు సారాయి తాగడం వలన కలిగే నస్టాలు….నాటుసారా అని పిలిచే ఈ మద్యాన్ని మరింత మత్తు కలిగించే పదార్ధంగా మార్చే ప్రక్రియలో అది విషపూరితం అవుతూ ఉంటుంది. నాటుసారాను బెల్లం, మొలాసిస్ తో తయారు చేస్తారు. దానికి యూరియా, తుమ్మచెక్క మరికొన్ని మత్తు కలిగించే పదార్ధాలను చేరుస్తారు.కొన్నిసార్లు నాటుసారా ఉత్పత్తి చేసే సమయంలో టాక్సిక్ ఆల్కహాల్‌తోపాటు కొన్ని జంతు ఉత్పత్తులను, తోలు చెప్పులను కలుపుతారు. ఫెర్మెంటేషన్ (కిణ్వ ప్రక్రియ)ను వేగవంతం చేయడానికి ఇలా చేస్తుంటారు. ఇలాంటివి సేవించినప్పుడు కూడా మనిషి శరీరం విషపూరితం కావడం, ఇన్ఫెక్షన్ సోకడంలాంటి ప్రమాదాలు ఉంటాయి. అంతేక ఈ నాటు సారా విషపూరితంగా మారి, దాన్ని తాగిన వారు మరణించడం జరుగుతుంది . ధీర్ఘ కాలంలో శరీరంలోని అంతర్గత అవయవాలు పని చేయడం మానేస్తాయి. మనిషి చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. కొంతమంది శరీరంలో ఈ కెమికల్ రియాక్షన్ నెమ్మదిగా జరుగుతుంది. నాటుసారాగా చెప్పే రసాయన పదార్ధంలో 95 శాతం ఆల్కహాల్ ఉంటుంది. దీన్ని ఇథనాల్ అని కూడా అంటారు.చెరుకు రసం, గ్లూకోజ్, బంగాళాదుంపలు, బియ్యం, బార్లీ, మొక్కజొన్న లాంటి పిండి పదార్ధాలను పులియబెట్టడం ద్వారా నాటుసారాను తయారు చేస్తారు.ఈ ఇథనాల్‌ను మరింత మత్తును కలిగించే రసాయనంగా చేసేందుకు, వ్యాపారులు అందులో మిథనాల్‌ను కలుపుతున్నారు.కావున ఇది వ్యక్తి మరణానికి దారితీస్తుంది కావున ప్రజలు ఈ నాటుసాయి తాగి అనారోగ్యం పాలు కావద్దని నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ R.రమణ గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ R.రమణ గారితో పాటు (SEB) స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోAES శ్రీధర్ రావు గారు, SEB సిఐ నాగమణి గారు, బండిఆత్మకూర్ SI టి . బాబు గారు వారి సిబ్బంది పాల్గొన్నారు.

About Author