PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

240 బాక్సుల అక్రమ మధ్యాన్ని సెబ్ అధికారులు సీజ్

1 min read

సెబ్ ఎక్స్ ఆఫీషియో అడిషనల్ డైరెక్టర్ అయిన జిల్లా SP శ్రీ జి.కృష్ణకాంత్, IPS,

జిల్లా SEB స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ శ్రీ నాగరాజు, వారి నిరంతర ఆదేశాల మేరకు….

కర్నూల్ SEB ఎన్ఫోర్స్మెంట్ సూపర్ఇంటెండెంట్ శ్రీ రవికుమార్ వారి పర్యవేక్షణలో….

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సుమారు 06:45 PM  గంటల సమయమున పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ఒక అశోక లేలాండ్ వాహనములో ఉన్న 240 బాక్సుల అక్రమ మధ్యాన్ని సెబ్ అధికారులు సీజ్ చేసి ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే,ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన శ్రీ R. పృధ్వీ రాజ్ మరియు పంచలింగాల చెక్ పోస్ట్ డ్యూటి రోస్టర్ సిబ్బంది ఎస్‌ఈ‌బి కానిస్టేబుల్ అయిన కే. నరసింహులు, కర్నూల్ తాలూకా పోలీసు స్టేషన్ HC అయిన H. మద్దిలేటి మరియు RTA హోంగార్డ్ V. మోహన్, కర్నూల్ ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ G. మారుతీ ప్రసాద్, తాలూకా పోలీసు స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ AC పీరయ్య వారి వారి సిబ్బంది తో కలసి  యూనిఫోర్మ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా సుమారు 06:45 PM  గంటల సమయమున  హైదరాబాద్ వైపు నుంచి  వస్తున్న తెల్లటి రంగు గల అశోక లేలాండ్ Reg.No: AP04TU6461 నెంబర్ గల వాహనమును తనిఖీ చేయగా అందులో వరి పొట్టు బస్తాలు ఉన్నాయని డ్రైవర్ చెప్పగా, వాహనం బరువు బేరీజు చూసి అనుమానంతో వరి పొట్టు మూటలను పరిశీలించగా లిక్కర్ వాసన రావడం గమనించిన సెబ్ పోలీసులు వాహనంలో ఉన్న వరి పొట్టు బస్తాలను తొలగించి చూడగా అందులో లిక్కర్ బాక్సులను గుర్తించారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి:

Property Details        :           240 బాక్సుల తెలంగాణ మధ్యమ + 1 అశోక లేలాండ్ వాహనం + 2 ఫోన్లు

అక్రమ మధ్యం వివరాలు    :           240 Boxes Of Double Kick Superior Whisky

(For Sale in Telangana Only11,520 Bottles (180 ML) 2073.6 LitersMonetary Value         :           Liquor = Rs.14,51,520/-   Vehicle Details   :           AP04TU6461     Ashok Leyland       Dost Ls Goods CarriageVehicle Value: Rs.4,00,000/-

Total Value   :           Liquor + Vehicle = Rs.18.51 Lakhs

వాహనంలో ఉన్న డ్రైవర్ పటాన్ సాదక్ మరియు సహాయకుడు షేక్ షఫీ లను  కడప జిల్లా చాపాడు మండలం పల్లవోలు కు చెందిన ఖాదర్ పల్లె వాస్తవ్యులుగా గుర్తించారు. జిల్లా ఎస్పి గారు ఏర్పాటు చేసిన ప్రత్యేక టెక్నికల్ టీమ్స్ ద్వారా విచారణ చేయగా ఈ అక్రమ మధ్యం అదే  ఊరికి  చెందిన చింపర్తి రింగుల బాష అలియాస్ లాల్ బాష అనే వ్యక్తికి సంబంధించినదని తేలింది. ఇదివరకే పన్నిన పధకం ప్రకారం వీరు కందనురు హాబీబుల్లా అనే వ్యక్తికి చెందిన వాహనంలో తెలంగాణ మధ్యమును  పొద్దుటూరు మరియు మైదుకూరు ఊర్లకు తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.   చింపర్తి రింగుల బాష అలియాస్ లాల్ బాష మీద  ఇదివరకు పలు ఎర్రచందనం, అక్రమ మధ్యం స్మగ్లింగ్ కేసులు ఉన్నట్టు విచారణలో వెల్లడి అయ్యాయి. కడప జిల్లా చాపాడు మండలం పల్లవోలు, ఖాదర్ పల్లె గ్రామానికి చెందిన A1 పటాన్ సాదక్, డ్రైవర్,  A2 షేక్ షఫీ, సహాయకుడు  A3 చింపర్తి రింగుల బాష, స్మగ్లర్  మరియు A4 కందనురు హాబీబుల్లా, వాహన యజమాని లను నిందితులుగా గుర్తించారు. ఈ మధ్యం అక్టోబర్-2023 మాసము నందు EMPEE DISTILLERIES LIMITED S/L KHODAY INDUSTRIES (HYD) తయారు చేయబడి IMFL DEPOT, WANAPARTHY కు రవాణా చేయబడి M/s Srinivasa Wines, Sy,No :487, జింకల పల్లి village, ఇటిక్యాల మండలము కు కేటాయించినట్లు గా గుర్తించడమైనదని ఈ కేసుకు సంబంధించిన వివరాలను సెబ్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపర్ ఇంటెండెంట్ అయిన శ్రీ రవి కుమార్ గారు వెల్లడించారు. 

ఆయన, ఈ కేసులో ప్రతిభ కనపరచిన  చెక్ పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ R. పృధ్వీ రాజ్, కర్నూల్ ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ G. మారుతీ ప్రసాద్, తాలూకా పోలీసు స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ AC పీరయ్య, సెబ్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ నరసింహులు, చెక్ పోస్ట్  కానిస్టేబుల్ అయిన కే. నరసింహులు మరియు  తదితరులను అభినందించి, సెబ్ కమీషనర్ మరియు జిల్లా ఎస్పి గార్ల తరపున రివార్డులను అందజేశారు.  తదుపరి ఈ కేసుకు సంబంధించి త్వరితగతి దర్యాప్తు  కోసం జిల్లా ఎస్పి గారు సెబ్, కర్నూల్ జిల్లా  ఏ.ఈ.ఎస్. మరియు కర్నూల్ సెబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో రెండు టీం లను ఏర్పాటు చేశారు.

About Author