‘ సెబ్’ సిబ్బంది నిజాయితీగా పని చేయండి..
1 min read– ఆరోపణలు వస్తే.. కఠిన చర్యలు
– సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: జిల్లాలో ఎక్కడైనా మద్యం, ఇసుక , నాటుసారా, గుట్కా, గంజాయి అక్రమంగా రవాణా అవుతున్నట్లు తెలిస్తే .. 7993822444 సెల్ వాట్సప్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్ ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అదేవిధంగా జిల్లాలో పని చేసే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ( సెబ్ ) సిబ్బంది నిజాయితీగా పని చేయాలని ఆదేశించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్ హెచ్చరించారు.