సెబ్ టాస్క్ఫోర్స్ తనిఖీ… 156 మద్యం బాటిళ్లు సీజ్
1 min read– ఒకరి అరెస్టు..
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు మండలం ఆర్టీఓ చెక్ పోస్టు వద్ద సెబ్ టాస్క్ఫోర్స్ తనిఖీలో తెలంగాణ మద్యం బాటిళ్లు తరలిస్తున్న కారును గుర్తించినట్లు సీఐ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం కర్నూల్ సహాయ పర్యవేక్షణాధికారి భరత్ నాయక్ ఆదేశాల మేరకు.. కర్నూల్ సెబ్ టాస్క్ ఫోర్స్ సీఐ రాజశేఖర్ గౌడ్ మరియు ఎస్సై స్వామినాథన్, సిబ్బంది కలిసి మండలంలోని rto చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా AP 09 TV 2387 రినాల్ట్ లోగాన్ కారు వాహనం లో కర్నూలు పట్టణం స్టాంటన్ పురం కి చెందిన వెంకటేశ్వరగౌడ్ అనే వ్యక్తి 78 (750 మి.లీ) బాటిళ్ల మాన్షన్ హౌస్ బ్రాందీ,24 (750 మి.లీ) బ్లెండర్స్ ప్రైడ్ విస్కీ , 18(750 మి.లీ) రాయల్ స్టాగ్ విస్కీ బాటిళ్లు, 12 (750 మి.లీ) టీచర్స్ హైలాండ్ విస్కీ బాటిళ్లు, 06(750 మి.లీ) బ్లాక్ & వైట్ విస్కీ బాటిళ్లు, 06 (750 మి.లీ) సిగ్నేచర్ విస్కీ బాటిళ్లు, 06 (750 మి.లీ) మెక్ డొవెల్ విస్కీ బాటిళ్లు, 06(750 మి.లీ) ఇంపీరియల్ బ్లూ విస్కీ బాటిళ్లు. మొత్తం 13 బాక్సులలో 156 (750 మి.లీ) విస్కీ బాటిళ్లు తరలిస్తుండగా మద్యం , కారుని స్వాధీనం చేసుకొని అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కానీ మద్యం బాక్సులు మహబూబ్ నగర్ జిల్లా మానవ పాడు గ్రామానికి చెందిన భరత్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి మద్యం బాక్సులను కర్నూలు టౌన్ కి చేరవేస్తున్నాడని, కర్నూలు పట్టణం స్టాంటన్ పురం కి చెందిన వెంకటేశ్వరగౌడ్ అనే వ్యక్తితో కలిసి వ్యాపారం చేస్తున్నట్టు విచారణ లో తెలిసింది. భరత్ కుమార్ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సెబ్ టాస్క్ ఫోర్స్ సిఐ రాజశేఖర్ గౌడ్ తెలిపారు. దాడులలో సిబ్బంది సురేష్, కరుణాకర్ , గోపాల్ సింగ్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.