PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో రెండో ముంబై !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ఒక‌ప్పుడు మారుమూల ప‌ల్లెగా ఉండేది. అప్ప‌ట్లో ప్రొద్దుటూరులో అధికంగా నీలిమందు వ్యాపారం చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి స్వదేశానికే కాదు.. విదేశాలైన నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు అధికంగా ఎగుమతి చేస్తూ వచ్చారు. నీలి మందు వ్యాపార లావాదేవీలు క్షీణించసాగాయి. వేరొక వ్యాపారం సాగిస్తే బాగుంటుందని భావించి బంగారం వ్యాపారం మొదలెట్టారు. 100 ఏళ్ల క్రితం ఓ 20 మంది స్థానికులు ఈ వ్యాపారాన్ని మొదలెట్టారు. నమ్మకాన్నే పెట్టుబడిగా బంగారు వ్యాపారం చేయసాగారు. అప్పట్లో వేళ్ళతో లెక్కేసే విధంగా ఉన్న బంగారు దుకాణాలు ఇప్పుడు లెక్కనేనంత ఉన్నాయి. బంగారానికి అందమైన రూపం అందించే స్వర్ణ కారులు కూడా ఎక్కువే. 1968లో అలనాటి ప్రభుత్వం గోల్డ్‌ కంట్రోల్‌ పై నూతన యాక్ట్‌ను ప్రవేశ పెట్టింది. దాని ఆధారంగా‌ దేశంలో లైసెన్సు లేకుండా బంగారు దుకాణాలు నిర్వహించం నేరమని.. బంగారు దుకాణాలు నిర్వహిస్తే కఠినమైన శిక్షలు విధించే వారు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేశారు. దీంతో రాయలసీమలోని ఇతర ప్రాంత బంగారు వ్యాపారులు ప్రొద్దుటూరుపై ఆధారపడేవారు.నాటి భారత ప్రభుత్వం బంగారాన్ని టెండర్ల ద్వారా విక్రయించేది. ఈ టెండర్లలో పాల్గొన్న ప్రొద్దుటూరు వర్తకులు 90 శాతం బంగారాన్ని దక్కించుకున్నారు. పెద్ద మొత్తంలో బంగారం దక్కించుకోవడంతో దేశమంతా ప్రొద్దుటూరు వైపు చూసింది. టెండర్ల అనంతరం ప్రొద్దుటూరులో పలుమార్లు సీబీఐ దాడులు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

                                   

About Author