PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలకు రెండో విడత ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అర్హులైన ప్రతి పేదవారికి రెండో విడత ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నందికొట్కూరు మున్సిపాలిటీ పట్టణంలో జరుగుతున్న జగనన్న హౌసింగ్ కాలనీ ప్రారంభించడానికి హాజరైనా ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి ,ఎమ్మెల్యే ఆర్థర్ , జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి లకు సీపీఐ(ఎం ఎల్) లిబరేషన్ అనుబంధ సంఘం అఖిల భారత కిసాన్ మహాసభ,ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ మహాసభ జిల్లా కార్యదర్శి పి.వెంకశ్వర్లు మాట్లాడుతూ  నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ లో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ పేద ప్రజలు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రమాణ స్వీకారం అనంతరం ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు  ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.మొదటి విడత ఇంటి స్థలాలు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే మిగతా  రెండో విడుతలో సచివాలయంలో ఆన్లైన్ లబ్ధిదారులు దాదాపు 1200 మంది ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. మూడు సంవత్సరాలైనా ఇంతవరకు వారికి ఇంటి స్థలం మంజూరు చేయలేదు.దీనివల్ల పట్టణంలో ఇల్లు లేక అద్దె ఇంటిలో నివసిస్తున్నారని పనులు లేక కుటుంబ ఆర్థిక భారంతో పాటు ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి ఏర్పడిందని అందువల్ల తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని స్థలాన్ని కొనుగోలు చేసి నిరుపేదలకు ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని అఖిల భారత కిసాన్ మహాసభ గా డిమాండ్ చేశారు. లేకపోతే ఇళ్ళు లేని నిరుపేదలకు అర్హులైన వారిని కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐసా జిల్లా కార్యదర్శి నాగార్జున ఐసా నందికొట్కూరు డివిజన్ కార్యదర్శి రంగస్వామి,ఏఐసీసీటీయూ నాయకులు మధు బాబు, రాఘవేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

About Author