అగ్రిగోల్డ్ బాధితులకు రెండో దశ చెల్లింపులు
1 min read–జిల్లాలో 28,296 మందికి లబ్ధిదారులకు 26.97 కోట్లు చెల్లించనున్న ప్రభుత్వం
పల్లెవెలుగు వెబ్ , కర్నూలు: అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రెండోదశ నగదు అందుజేనుంది. 10 వేల నుంచి రూ.20వేలలోపు డిపాజిట్దారులు లబ్ధిపొందనున్నారు. కర్నూలు జిల్లాలో 28,296 మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఈ నెల 24న 26 కోట్ల 97 లక్షల 55 వేల 406 రూపాయలు చెల్లింపులు చెల్లించనున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం… నగదు చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.