రెండో దశ చర్చలు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధంగా ఆగుతుందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఇరు దేశాల ప్రతినిధులు చర్చలకు బయలుదేరారు. మరో రెండు గంటల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరగనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. చర్చలు చర్చలే.. దాడులు దాడులేనని.. అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. తమ డిమాండ్లను ఇంతకు ముందే చెప్పాం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్ ల్యూనిస్క్‌లను వదిలేయాలని ఉక్రెయిన్ అంటోంది. ప్రస్తుతం ఈ రెండో విడత చర్చల కోసం ఉక్రెయిన్ ప్రతినిధులు బెలారస్‌కు బయలుదేరారు. కాగా ఫిబ్రవరి 28న బెలారస్‌లో రష్యా ఉక్రెయిన్‌ల మధ్య సుమారు 4 గంటల చర్చలు జరిగాయి. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైయ్యాయి.