PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాదయాత్ర భక్త బృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: మార్చి 19వ తేదీ నుండి 23 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భముగా అధిక సంఖ్యలో వచ్చే పాదయాత్ర భక్తులకు కల్పించే సౌకర్యాల కల్పించే విషయమైచర్చించేందుకు పరిపాల భవనంలో ఈఓ లవన్న సమావేశం నిర్వహించారు . కర్ణాటక మరియు మహారాష్ట్రలకు చెందిన పలు పాదయాత్ర భక్తబృందాలు మరియు స్వచ్చంద సేవాసంస్థల భక్తబృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు.కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు, పాదయాత్ర బృందాలుమరియు స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులతో ఈ నెల 5వ తేదీన బాగల్ కోట్ జిల్లా రబ్మవిలో మొదటిసమన్వయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు సమీక్ష సమావేశంలో బాగల్ కోట్, తుముకూరు, బీజాపూర్ (విజయపుర), బెళగావి, బసవన బాగేవాడి తదితర ప్రాంతాలు మరియు మహారాష్ట్రలోని షోలాపూర్, అక్కల్ కోట్ ప్రాంతాలకు చెందిన సుమారు 30 భక్తబృందాలు, పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ మొదటి సమన్వయ సమావేశానికి మరియు ధర్మప్రచారంలో భాగంగా అక్కడ జరిపిన ధర్మరథయాత్ర మరియు కల్యాణోత్సవానికి కర్ణాటక మరియు మహారాష్ట్ర భక్త బృందాలు ఎంతగానో సహకరించాయని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈవో లవన్న తెలియజేశారు ఉగాది ఉత్సవాలలో అయిదురోజులపాటు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమేకల్పించబడుతుందని, ఉత్సవాల రోజులలో శ్రీ స్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉందడని పేర్కొంటూ, ఈ విషయములో భక్త బృందాల ప్రతినిధులు భక్తులలో అవగాహన కల్పించాలన్నారు.. భక్తులు సేద తీరేందుకుఆరుబయలు ప్రదేశాలలో చలువపందిర్లు మరియు మంచినీటి భక్తులకు ఏర్పాటు చేశారుక్యూలైన్లలో భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందించడం జరుగుతుందని అన్నారు.ఈ వితరణకుగాను స్వచ్ఛంద సేవకులు సేవలను అందించాలన్నారు.ఉత్సవాల సందర్భంగా క్షేత్రపరిధిలో పలు చోట్ల వైద్యశిబిరాలు ఏర్పాటు చేయబడుతాయన్నారు. అదేవిధంగా దేవస్థానం వైద్యశాల నిరంతరం వైద్యసేవలను అందిస్తుందన్నారు. శ్రీశైలక్షేత్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రం కూడా నిరంతరం వైద్యసేవలు అందిస్తుందనిపేర్కొన్నారు.

About Author