PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెండవ విడత యన్ సి డి సి రుణాలను వెంటనే విడుదల చేయాలి

1 min read

– వై.నాగేశ్వరరావు యాదవవ్రాష్ట్ర గొర్రెల పెంపకం దారుల ఫెడరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్, కర్నూలు యొక్క సర్వసభ్య సమావేశము అధ్యక్షులు శ్రీ.వై. నాగేశ్వరరావు యాదవ్ గారి అధ్యక్షతన కార్యనిర్వాహక సంచాలకులు డా. ఎస్. సుభాన్ బాష అధ్వర్యంలో కర్నూలు లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేడీ డా కె. రామచంద్రయ్య గారు,డీసీఓ డా. కె.వెంకటకృష్ణ గారు,డా ఆర్. శ్రీనివాస్ రెడ్డి గారు, డైరెక్టర్లు – మురళీ మనోహర్ గారు,రంగనాథమయ్య గారు, వెంకటసుబ్బయ్య గారు, లక్ష్మన్న గారు,రామాంజనేయులు గారు,నారాయణ గారు,నరసింహులు గారు,కర్నూలు, నంద్యాల జిల్లాలోని వివిధ ప్రాథమిక సంఘాలు అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ సమావేశం లో వై.నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూప్రతి ఒక్క సంఘ సభ్యులు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే రుణాలను సక్రమంగా వినియోగించుకుంటున్నారు.కానీ వాటిని తిరిగి చెల్లించడం లేదు. ఇలా తిరిగి చెల్లించకపోతే మీ సంఘంలోని సభ్యులే నష్టపోతారు. కావున సకాలంలో రుణాలను చెల్లిద్దాం. ప్రతి గ్రామ సొసైటీకి ఐదు ఎకరాలు బంజరు భూమి ఇవ్వాలి. వేసవికాలంలో జీవాల దప్పికను తీర్చేందుకై ప్రతి 10 కిలోమీటర్లకు ఒకచోట నీటి కుంటలను ఏర్పాటు చేయాలి. నూతన కొత్త సంఘాల ఏర్పాటుకు కృషి చేయాలి. మన వృత్తి కనుమరుగైయే పరిస్థితిలో ఉంది కావున యువతను ప్రోత్సహించండి ఆధునిక మేలుకువలు నేర్చుకోండి. మేలు రకమైన మాంసం ఉత్పత్తిని ప్రజలకు అందిస్తున్నాము..మూడు గొర్రెలు అంతకన్నా ఎక్కువ చనిపోతే డాక్టర్ వైయస్సార్ బీమా చెల్లుతుంది.ప్రతి ఒక్క గొర్రెల పెంపకదారులు ప్రీమియం 20% కట్టుకోవాలి.పీటిర్ టీకాలు వేయించుకోవాలి. ఒక గొర్రె చనిపోతే 6000 రూపాయలు వస్తాయి.ఇలా 50 గొర్రెల,మేకల చనిపోతే వర్తిస్తుంది.ప్రాథమిక సంఘాల ఆడిట్ ను సక్రమంగా ప్రతి సంవత్సరం చేయించుకోవాలి.లేనియెడల సంఘాలు రిజిస్ట్రేషన్స్ చెల్లవు.కావున ప్రతి ఒక్కరు సంఘాల ఆడిట్ తప్పనిసరిగా చేయించుకోవాలి.సహకార సంఘాల అభివృద్ధి, సహకార సంఘాల విలువలు – స్వచ్ఛంద సభ్యత్వం చేపించాలి. సభ్యులందరూ ప్రజాస్వామ్యం చేత ఎన్నుకోబడాలి. సభ్యుల ఆర్థిక భాగస్వామ్యం కల్పించాలి. సంఘ సభ్యులకు,విద్య పరంగా,పెంపకం గురించి ఒక అవగాహనను కల్పించింది. డాక్టర్లు నిర్వహించే శిక్షణా తరగతులకు ప్రతి ఒక్క గొర్రెల పెంపకం దారుల సంఘం నాయకులు హాజరు కావాలి. సహకార సంఘాల వ్యాల్యూస్ మన సంఘంపై మన సంఘ సభ్యులు బాధ్యతలు కలిగి ఉండాలి. చేనేత గీత కార్మికుల వాళ్ళ ప్రతి గొర్రెల పెంపకం దారులకు పెన్షన్లు మంజూరు చేయాలి.2వ విడత యన్ సి డి సి రుణాలను వెంటనే విడుదల చేయాలి. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతాం.యన్ సి డి సి పథకము అమలు, మంజూరు అయిన నిధులు మంజూరు అయిన యూనిట్లు,ఖర్చుఅయిన నిధులు, లోన్ రికవరి, రుణ ఎగవేత దారుల గురించి,నట్టల నివారణ మందులను సంవత్సారానికి(4) విడతలు పంపిణీ చేయుట, ప్రాథమిక గొర్రెలపెంపకందారుల సహకారసంఘాల అభివృద్ధి, వివిధ విషయములపై ప్రాథమిక సంఘాల అధ్యక్షులతో చర్చించడం జరిగింది.

About Author