కేరళ సమీపంలో రహస్య దీవి.. !
1 min readపల్లెవెలుగు వెబ్: కేరళలోని కొచ్చి తీర సమీపంలో గూగుల్ మ్యాప్స్ ఓ దీవి లాంటి నిర్మాణాన్ని కనుగొంది. ఇది సముద్ర గర్భంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని చెల్లనమ్ కర్షిక టూరిజం డెవలప్ మెంట్ సొసైటీ గుర్తించింది. ఇది కొచ్చి తీరానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని మీద శాస్త్రవేత్తలు పరిశోధన జరుపుతున్నారు. నీటి అడుగున ప్రవాహం కారణంగా దీవి లాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. తీర అవక్షేపం కోతకు గురికావడం వల్ల ఇలాంటి నిర్మాణం ఏర్పడి ఉండవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 8 కిలోమీటర్ల పొడువు, 3.5 కిలో మీటర్ల వెడెల్పు ఉన్నట్టు గుర్తించారు. దీనిపైన పరిశోధన చేయాల్సిందిగా.. కేరళ ప్రభుత్వం ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ అధికారులను ఆదేశించింది.