PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘సచివాలయ’ ఉద్యోగులపై..చులకన..!

1 min read
  • ఉద్యోగులతో సమానంగా… సచివాలయ ఉద్యోగులను చూడాలి
  • ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరికుమార్​ రెడ్డి

పల్లెవెలుగు:ఉద్యోగులపై నిర్లక్ష్యం వహించే రాష్ట్ర ప్రభుత్వం…. కనీసం సీఎం మానస పుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై కూడా పట్టించుకోరా… అని ఘాటుగా ప్రశ్నించారు ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్​ రెడ్డి. ఏపీజేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మలిదశ ఉద్యమంలో భాగంగా శనివారం గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలు నగరంలోని ధర్నా చౌక్​ వద్ద ధర్నా నిర్వహించారు. ఏపీజేఏసీ చైర్మన్​ గిరికమార్​ రెడ్డి నేతృత్వంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులు, గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.   ఈ సందర్భంగా గిరికుమార్​ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి మానసపుత్రికలుగా అభివర్ణింపబడ్డ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  అర్హత సాధించిన, రెండో విడత నియమకమైన గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల ప్రొబేషన్ వెంటనే….డిక్లేర్ చేయడంతోపాటు ఏపీజిఎల్ఐ బాండ్లు వెంటనే..  జారీ చేయాలని డిమాండ్​ చేశారు. మహిళా కార్యదర్శా…లేక మహిళా పోలీసా…ఎంపిక చేసుకునే అవకాశం వారికే కల్పించాలి. గ్రామ వార్డు సుచివాలయ ఉద్యోగులకు అన్ని రకాల సెలవులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వెంటనే…మంజూరు చేయాలి.   ప్రొబేషన్ డిక్లేర్ చేయబడి వారికి రావలసిన 9 నెలల కాలానికి బకాయిలు వెంటనే చెల్లించాలి,   విపరీత పనిభారంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్ల మీద పనిఓత్తిడి తగ్గించాలని,   గ్రామ వార్డు సుచివాలయ ఉద్యోగులకు PRAN ఖాతాల్లో 9 నెలల పెన్షన్ ఫండ్ బకాయిలు వెంటనే జమచేయలని,  గ్రేడ్ 5 పంచాయితీ కార్యదర్శులకు అధికారాలు వెంటనే.. కల్పించాలని, వారికి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ రూపొందించాలని కోరారు. అంతేకాక Grade-II VROలకు ప్రొబేషన్ వెంటనే…డిక్లేర్ చేయాలని,   గ్రామ వార్డు సుచివాలయ ఉద్యోగులైన వెల్ఫేర్ అసిస్టెంట్లుకు ప్రమోషన్ ఛానల్ని కల్పించాలని  గ్రామ మహిళా  కార్యదర్శులకు బందోబస్తు డ్యూటీలు.. కేటాయించరాదని,  గ్రామ వార్డ్ సచివాలయ ANMల మీద యాప్ ల భారం.. తగ్గించాలని,   గ్రామ వార్డు సుచివాలయ ఉద్యోగులకు CPT పరీక్షలు వెంటనే … నిర్వహించాలి  శానిటేషన్ కార్యదర్శులకు మేస్త్రి డ్యూటీలను.. రద్దు చేయాలని  తదితర సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఏపీజేఏసీ పోరాటం ఆగదన్నారు.

About Author