ఆత్మకూరులో 144 సెక్షన్
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా ఆత్మకూరులో 144 సెక్షన్ విధించారు. ఈనెల 13 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తహశీల్దార్ ప్రకాష్ బాబు తెలిపారు. ఓ నిర్మాణం విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నంద్యాల టర్నింగ్, కొత్తపేట, మెయిన్‌బజార్, కప్పలకుంట్ల, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కర్నూలు–గుంటూరు రహదారి వంటి ముఖ్యమైన ప్రదేశాల్లో పోలీసు పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ఎక్కడకు తరలించారో చెప్పడం లేదు. జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆత్మకూరులోనే మకాం వేసి శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.