NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సికింద్రాబాద్.. రైల్వే బోగీల‌కు నిప్పు పెట్టిన వీడియో వెలుగులోకి .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అగ్నిప‌థ్ స్కీమ్ వ్య‌తిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్లో జ‌రిగిన అల్లర్ల కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరికొన్ని వీడియోలు వెలుగులోకొచ్చాయి. రైల్వే ఆస్తులు, బోగీలకు కేసులో A12గా ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పృథ్విరాజ్‌ అనే వ్యక్తి నిప్పు పెట్టినట్లు ఆ వీడియోల్లో ఫుటేజీల ఆధారంగా పోలీసులు తేల్చారు. ప్యాసింజర్ బోగీలోకి వెళ్లి మరీ పృథ్విరాజ్‌ నిప్పు పెట్టినట్లు తెలిసింది. అంతేకాదు.. విధ్వంసం వీడియోలను వాట్సాప్‌ గ్రూప్‌ల్లో కూడా అతను షేర్ చేసినట్లు సమాచారం. దీంతో.. పృథ్వీని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

                                    

About Author