PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టరేట్ కాంప్లెక్స్ లో భద్రతా పరంగా చర్యలు తీసుకుంటాం

1 min read

– డిఆర్ఓ కె.మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు:  కలెక్టరేట్ కాంప్లెక్స్ లో భద్రతా పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని, అందుకు అన్ని కార్యాలయాల అధికారులు సహకరించాలని డిఆర్ఓ కె. మధుసూదన్ రావు సూచించారు. శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులోకలెక్టరేట్ లోని కార్యాలయాల మెయింటెనెన్స్ కు  సంబంధించి ఆయా కార్యాలయాల అధికారులతో డిఆర్ఓ  సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ  మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.. కలెక్టరేట్ కాంప్లెక్స్ దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉందన్నారు.. చుట్టూ చాలా గేట్లు ఉండడం వల్ల భద్రతాపరంగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పోలీస్ అధికారులు సూచించారని తెలిపారు..కలెక్టరేట్ లోని కార్యాలయాల సిబ్బంది కాకుండా అవసరం లేని వారు కూడా రాత్రి వేళల్లో కూడా సంచరిస్తున్నందున భద్రతాపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు..అలాగే    ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  కార్యాలయాలలో విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది ఖచ్చితంగా  ఐడి కార్డును ధరించి కార్యాలయాలకు రావాలన్నారు. ఐడి కార్డులు లేని సిబ్బందికి ఆయా శాఖల హెచ్ఓడి లు ఐడి కార్డులను జారీ చేయాలని  హెచ్వోడీలకు డిఆర్ఓ తెలియజేశారు. కార్యాలయాల వాహనాల పార్కింగ్ సక్రమంగా ఉండేలా రెండు రోజుల్లో చర్యలు తీసుకుని తెలియ చేస్తామని, ఆ మేరకు వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. సిఐలు ప్రసాద్, మురళీధర్ రెడ్డి లు మాట్లాడుతూ  కలెక్టర్ కాంప్లెక్స్ 7 గేట్లు కలిగి ఉందని, కలెక్టరేట్ లోపలకు  50 శాతం మంది ఏ అవసరం లేని వ్యక్తులే  వస్తున్నారని, రాత్రి వేళల్లో కూడా కొంత మంది అంటున్నారని,  అలాంటివారిని గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు….కాంపౌండ్ వాల్ కూడా ఎత్తు చాలా తక్కువగా ఉందని, పెరిఫెరల్ కెమెరాలు కూడా లేవని, చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల  భద్రతా పరంగా చర్యలు చాలా అవసరం అని పేర్కొన్నారు.. పోలీసు సిబ్బంది సంఖ్యను కూడా పెంచుతున్నాం అని తెలిపారు.. కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు భద్రతా పరంగా  పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆర్ అండ్ బి ఎస్ఈ నాగరాజు మాట్లాడుతూ కలెక్టర్  ఆదేశాల మేరకు ముఖ్యమైన గేట్ లను మాత్రమే ఉంచబోతున్నామని తెలిపారు. అనంతరం కలెక్టరేట్ కాంప్లెక్స్ గేట్లను,  పార్కింగ్ ప్రదేశాలను  డిఆర్ఓ, ఆర్ అండ్ బి ఎస్ ఈ, సిఐలు పరిశీలించారు.

About Author