NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ కార్యాల‌యం వ‌ద్ద 200 మందితో భ‌ద్రత !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల చేసిన వారిపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని డీజీపీ కార్యాల‌యం ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది. శాంతిభ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ‌లో భాగంగా ప్రజ‌లు సంయ‌మ‌నం పాటించాల‌ని డీజీపీ కోరారు. రెచ్చగొట్టే వ్యాఖ్యల‌తో ప్రజ‌లు ఆవేశానికి లోనుకావొద్దన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై క‌ఠిన చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు. చ‌ట్టాన్ని ఎవ‌రూ చేతుల్లోకి తీసుకోవ‌ద్దని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అద‌న‌పు బ‌ల‌గాలు మోహ‌రించిన‌ట్టు తెలిపారు. తెదేపా కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద 200 మందితో భ‌ద్రత ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. టీడీపీ కార్యాల‌యాల‌పై దాడుల నేపథ్యంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యం వ‌ద్ద కూడ భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

About Author