184 మంది ప్రజాప్రతినిధులకు భద్రత ఉపసంహరణ !
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా 184 మందికి సంబంధించిన భద్రతను ఉపసంహరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారికి ఉన్న ముప్పును అంచనా వేసి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ చోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణికే ఉన్నారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు, మంత్రుల కుటుంబానికి ఉన్న భద్రతను కూడా ఉపసంహరించారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్ కుటుంబీకులు కూడా తమ భద్రతను కోల్పోనున్నారు.