ఏలూరు జ్యూట్ మిల్లు కార్మికులకు ఇబ్బంది లేకుండా చూడండి..
1 min readకలెక్టర్‌ను ఆదేశించిన డిప్యూటీ సీఎం ఆళ్ళనాని
పల్లెవెలుగు వెబ్, ఏలూరు: శ్రీకృష్ణ జ్యూట్ మిల్లు మూసివేత వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టిపెట్టారు. ఏలూరు జ్యూట్ మిల్లు ముసివేత వ్యవహారంపై గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తో ఫోనులో మాట్లాడి.జ్యూట్ మిల్లులో పని చేస్తున్న కార్మికులకు ఇబ్బంది లేకుండా తగిన విధంగా చర్యలు చేపట్టాలని అదేశించారు. ఏలూరు జ్యూట్ మిల్లు యాజమాన్యం,కార్మికులు వివాదంపై లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు మంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో గురువారం మధ్యాహ్నం ఏలూరు జ్యూట్ మిల్లు యాజమాన్యం,కార్మిక సంఘాల నాయకులు,లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి ఆళ్ల నానికి తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏలూరు జ్యూట్ మిల్లులో పని చేస్తున్న కార్మికుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను ఆదేశాలు జారీ చేశారు, కార్మికుల చట్టాలకు అనుగుణంగా జ్యూట్ యాజమాన్యం,కార్మికుల సంఘాల నాయకులు,లేబర్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చలు జరిపి త్వరలోనే సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఉన్నత అధికారులకు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.