PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న చేసిన మేలును చూసి ఓటు వేయండి

1 min read

సాయిబాబా పేట లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎన్నికల ప్రచారం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని సాయిబాబా పేట 16,17వ వార్డులలో శుక్రవారం  శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి  గడప గడపకు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.  ముందుగా పట్టణంలోని సాయిబాబా దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గడప గడపకు వెళ్ళి నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ  ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్ , నంద్యాల జిల్లా ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి ల   గెలుపునకు కృషి చేయాలని కోరారు. వైసిపి ప్రభుత్వంలో జగనన్న చేసిన సంక్షేమం మరియు ఎన్నడూ లేని విధంగా పట్టణ అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.  జగనన్న చేసిన మేలును గుర్తు పెట్టుకోవాలని  ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మన్సూర్, పట్టణ ఉపాధ్యక్షులు చింతా విజ్జి, 17వ వార్డు కౌన్సిలర్ అబ్దుల్ రవూఫ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వా శివరామకృష్ణ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ గఫార్, డి.రమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జబ్బార్, మిడ్తూరు మండల సింగిల్ విండో చైర్మన్ నాగ తులసి రెడ్డి, తిరుమలేశ్వర రెడ్డి, జిల్లా ఎక్జిక్యూటివ్ మెంబర్ ఉస్మాన్ బేగ్, శ్రీ నంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ బద్దుల శ్రీకాంత్, బి.సీ నాయకులు కాళ్ళూరి శివ ప్రసాద్, ఎస్సీ సెల్ యాట ఓబులేసు, చరణ్ తేజ, జిల్లా ఎక్జిక్యూటివ్ సభ్యురాలు సులోచనమ్మ, పట్టణ యూత్ వింగ్ ప్రెసిడెంట్ లడ్డూ ( హిదాయతుల్లా), పట్టణ ప్రధాన కార్యదర్శి మార్కెట్ రాజు, తర్తూరు మహేశ్వర రెడ్డి కౌన్సిలర్ లు కాటెపోగు చిన్నరాజు, అల్లూరి క్రిష్ణ, బోయ శేఖర్, దేశెట్టి శ్రీనివాసులు, షేక్ నాయబ్, శాలి భాష, వి.ఆర్ శ్రీను, చింతా శ్రీను, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, లాలు ప్రసాద్, పి.రమేష్, మనపాడు అశోక్, బ్రహ్మయ్య ఆచారి, ఉపేంద్ర రెడ్డి, గుర్రాల భాస్కర్ రెడ్డి, కురువ శ్రీను, బొల్లెద్దుల రామక్రిష్ణ, చెరుకు సురేష్, చాంద్ భాష, రైతు సంఘం బాబు, అబ్దుల్ రెహమాన్, ల్యాబ్ రవి, ఆశాం, గౌండ మాలిక్, బాండ్స్ శ్రీను, బద్రి, చల్లా శివారెడ్డి, శంకర్ రావు, రంగన్న, డిష్ భాస్కర్, నాగశేనా రెడ్డి, ఉస్మాన్, మధుసూదన రెడ్డి, ముచ్చుమర్రి భాష, ఆశాం, భార్గవ తేజ, చింతా నాగేంద్ర, తదీతరులు పాల్గొన్నారు.

About Author