NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంక్షేమ పథకాలను చూసి మళ్ళీ ఆశీర్వదించoడి : ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు, వెబ్​ వెలుగోడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్ళీ ఆశీర్వదించి , ఓటు వేసి గెలిపించాలని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. వెలుగోడు గ్రామం జమ్మినగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి పూలు చల్లుతూ మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలతో , శాలువాలతో వెలుగోడు గ్రామ ప్రజలు , నాయకులు అధికారులు , మహిళలు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు. జమ్మిచెట్టు దగ్గర రూ.5 లక్షల 15వ ఆర్థిక సంఘము నిధులతో నిర్మించిన సి సి.రోడ్డు ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్ళి జగనన్న ప్రభుత్వము అందచేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ , ప్రజలు అడుగుతున్న సమస్యలను , అక్కడికి అక్కడే సంబంధిత అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరించారు. వెలుగోడు మండలం లోని బోయరేవుల గ్రామానికి చెందిన సామేలు అనే రైతు పంట నష్టాలకు , అప్పుల బాధలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని మరణించగా , ఎమ్మెల్యే ప్రభుత్వము ద్వారా వచ్చిన రూ. 7 లక్షలను ఆర్ధిక సహాయం మృతుని భార్యకు అందించడం జరిగింది. అలాగే స్థానికo గా నిర్మిస్తున్న సేవా లాల్ దేవాలయo నందు కల్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేసి , ఎమ్మెల్యే రూ.10 లక్షల విరాళం అంద జేశారు. అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ ను ఎమ్మెల్యే తనిఖీ చేసి తల్లులకు , పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అమానుల్లా , ఆర్ డబ్ల్యు ఎస్ డి.ఇ , ఏ.ఇ పక్కిరయ్య , వెలుగు ఏపీఎం పుల్లయ్య , డిప్యూటి తహశీల్దార్ , వైఎస్ ఆర్ సిపి నాయకులు నియోజకవర్గ సమన్వయకర్త భువనేశ్వర రెడ్డి , ప్రభాకర రెడ్డి , ఎంపిపి రమేష్ , సింగిల్ విండో చైర్మన్ నాగేశ్వర రెడ్డి , సర్పంచ్ జయపాల్ , వైస్ ఏoపిపి శంకర్ నాయక్ , ఇలియాస్ ఖాన్,తెలుగు రమణ, సూర్యనారాయణ , రామ్మోహన్ రెడ్డి , జెఫ్పిటిసి తనయుడు శంషీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

About Author