విత్తనాలు నాటే డ్రోన్.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ఆస్ట్రేలియాకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘ఎయిర్ సీడ్ టెక్నాలజీ’ డ్రోన్‌ను రూపొందించింది. ఈ డ్రోన్ శరవేగంగా గగనతలంలో ప్రయాణిస్తూ, భూమిమీద ఖాళీగా ఉన్న బంజరు నేలలను గుర్తించి, అనువైన చోట విత్తనాలను నాటగలదు. మరో రెండేళ్లలోగా ఆస్ట్రేలియాలో 10 కోట్ల వృక్షాలను నాటే దిశగా, ఇలాంటి డ్రోన్‌లను పెద్ద సంఖ్యలో రంగంలోకి దించనున్నట్లు ‘ఎయిర్ సీడ్ టెక్నాలజీ’ చెబుతోంది.