సీమ రైతులకు కన్నీటి కష్టాలు తప్పవేమో
1 min read– ఆందోళన వ్యక్తం చేసిన… టి.డి.పి. జిల్లా అధ్యక్షులు బి.టి. నాయుడు
పల్లెవెలుగు కల్లూరు అర్బన్ : కరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జలాశాయాలైన మాధవవరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గాజులదిన్నె ప్రాజెక్టు, పులికనుమ, గురురాఘవేంద్ర, వెలుగోడు, గోరుకల్లు, అవుకు, శ్రీశైలం, పాతిరెడ్డిపాడు, గండికోట, లు అడుగంటిపోయినవని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, యం.యల్.సి. బి.టి.నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పత్రికల వారితో మాట్లాడుతూ కరువుతో తల్లడిల్లే రాయలసీమలోని పల్లె వాసులకు త్రాగునీటి ముంపుపొంచి ఉంది. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఈ.ఏ.సి. సిఫారస్ చేయడంతో రాయలసీమ రైతులకు తీరని అన్యాయం జరుగుతుందనీ ఆయన తెలియజేశారు. శ్రీశైలం జలాశయంలో 820 అడుగుల నుండి ఈ నీటిని ఎత్తిపోసే ఈ పథకం పూర్తి అయితే రాయలసీమకు సాగునీరు అసాధ్యమని తెలిపారు. శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుకోగానే వచ్చిన వీటిని వచ్చినట్లే ఎత్తిపోస్తే రాయలసీమ రైతుల కంటిలో రక్తదారలు ఖాయమని పేర్కొన్నారు. 820 అడుగుల 3 టి.యం.సి.లు ఎత్తిపోసుకోవడానికి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాలపై తెలంగాణా ప్రభుత్వం యస్.జి.టి. (జాతీయ హరితట్రిభ్యూనల్లో) కేసువేయగా పనులు ఎక్కడికక్కడే ఆపివేశారు. యస్.జి.టి.లో సమర్థవాదనలు ఆంధ్రప్రదేశ్ తరుపున వినిపించలేదు. ఈ విషయంలో పూర్తి ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. దీనికి నైతిక భాద్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్.కు పాదాభివందనాలు, అలింగణాలు, చీకటి ఒప్పందాలు తప్ప ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి రాయలసీమ గోడు వినిపించదు. కనిపించదనీ అన్నారు. సీమకు సాగునీరందాలంటే తుంగభద్ర పై గుండ్రేవుల నిర్మాణమే పరిష్కారం క్రిష్ణానది వరద దినాలు తగ్గిపోయి, తక్కువ రోజులలో ఎక్కువనీరు తీసుకోవాల్సిన లక్ష్యంతో రాయలసీమ దుర్భిక్ష నివారణ కమీషన్ ” (ఆర్.డి.యం.పి.) పేరుతో హడావిడి చేశారు. ఇందులో భాగంగా శ్రీశైలం జలాశయంలోని 820 అడుగుల మట్టంలో రోజుకు 3 టి.ఎం.సి.ల నీటిని ఎత్తిపోసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు రూ.3278 కోట్లు ఆగస్టు 2020 లో పనులకు శ్రీకారం చుట్టారు. సంగమేశ్వరం దగ్గర కృష్ణా పరద జలాలను ఎత్తిపోసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన యస్. ఆర్.యం.సి. కాలువలో పోయాలని నిర్ణయించారు. అయితే దీనిపై తెలంగాణా ప్రభుత్వం యన్.ఆర్.జి.టి.ఫిర్యాదుచేసింది. దీనిపై యన్.ఆర్.జి.టి. పరిశీలనకు కమిటీని పంపించింది. ఏడాదిన్నర కాలమైనా యస్.ఆర్.జి.టి.కి రాష్ట్ర ప్రభుత్వం సరైన వాధనలు, సమచారం ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందనీ తెలియజేశారు. దీని ఫలితంగా యస్.ఆర్.జి.టి. తెలంగాణకు అణుకూలంగా పర్యావరణ అనుమతులిచ్చింది. ఈ సాకుతో సి.యం. జగన్మోహన్ రెడ్డి గారు పనులు ఆపేశారు. కాంట్రాక్టర్కు కేవలం రూ. 739 కోట్లు మాత్రమే చెల్లించారు. కర్నూలు-కడప జిల్లాలకు కె.సి కెనాల్ కింద 2.35 లక్షల ఎకరాల ఆయకట్టు స్థితికరించబడినది.. బచావత్ అవార్డు ప్రకారం 31.45 టి.ఎం.సి. నికర జలాల వాటా ఉంది అయితే ఆ నీ టిని నింపుకోవడానికి జలాశయాలు లేవు. తుంగభద్ర నీరు క్రిష్ణానదిలో కలువకుండా సుంకేసుల బ్యారేజీ ఎగువన గుండ్రేవుల జలాశయం నిర్మాణం జరిగితే 20 టి.యం.సి.ల నీటిని నిలువ చేసుకునే అవకావం ఉందని ” తెలిపారు. 21-2-2010లో అనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూ. 2890 కోట్లు మంజూరు చేస్తూ జి.ఓ. నెం 153ని జారీచేశారు. ఈ గుండ్రేవుల పూర్తిఅయితే 2.05 లక్షల ఎకరాలు కె.సి. కెనాల్, గురు రాఘవేంద్ర, పులికనుమ, పులకుర్తి, ఎత్తిపోతల పథకాల ద్వారా కర్నూలు పార్లమెంట్ పరిధికి సాగునీరు అంది సశ్యశ్యామలమౌతుందనీ వారు తెలియజేశారు. గుండ్రేవుల కుడివైపున కాల్వ త్రవ్వి నంద్యాల జిల్లా మిడుతూరు దగ్గర 7.10 టి.యం.సి. సామర్ధ్యం రిజర్వాయర్ నిర్మిస్తే నంద్యాల పార్లమెంట్ మరియు కడప జిల్లా కొండాపురం మండలం గండికోట ఎగువన పెన్నా నదిలో కలిపితే కడప జిల్లాకు కూడా సాగునీరు అందుతుంది. గమనిక: ఒక్క ఎత్తిపోతల పథకం లేకుండా గ్రావిట్ ద్వారా నీటిని మల్లించవచ్చును. అయితే అవగాహన లేని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గుండ్రేవుల ప్రాజెక్టును అంతర్ రాష్ట్ర వ్యవహారమని అటకెక్కించారు. శ్రీశైలం జలాశయంలోని 800 అడుగుల నీటిమట్టంలో హంద్రీనీవా, శే.సి. కాల్వకు 4800 క్యూసెక్కుల నీరు ఎత్తిపోసే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పూర్తిచేశారు. 8-8-2017 నాడు సంగమేశ్వరం నుండి అప్రాచ్ కెనాల్క త్రవ్వి ముఖ్యమంత్రి హెూదాలో శ్రీ చంద్రబాబునాయుడు గారు జాతికి అంకితం చేశారు. ముచ్చుమర్రి ప్రాజెక్టు నుండి రాయలసీమ ప్రాజెక్టులకు ఎలా పంపించాలి డి.పి.ఆర్. తయారు చేయమని అనాడు అధికారులను ఆదేశించారు. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి భానకచర్ల క్రాస్ రెగ్యులేటర్లోకి 2 టి.యం.సి ల నీరు ఎత్తిపోసేలా రూ. 5620 కోట్లు డి.పి.ఆర్. తయారు చేశారు. మరియు గడివేముల మండలం సమీపాన గల కుందూనధిలో ఎత్తిపోసి గాలేరు నగరి, కె.సి. కెనాల్, తెలుగుగంగకు నీరు ఇవ్వాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇది చంద్రబాబు గారి విజన్ అని తెలిపారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడం రాయలసీమ వాసుల దురుదృష్టమని ఆయన వివరించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సాగునీరు, త్రాగునీరు, అవగాహన లేదు. సారా అన్నా, బీరన్నా, అవగాహన ఉంది. ఇది రాయలసీమ వాసులకు శాపంగా మారిందనీ వివరించారు.