సీమకు కృష్ణా జలాలు ఇచ్చి ఆదుకోవాలి! బాలయ్య
1 min readపల్లెవెలుగువెబ్, అనంతపురం : రాయలసీమను కరువు నుంచి కాపాడాలంటే…కృష్ణా జలాలను అవసరమైనంత మేర వినియోగించాలని హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆదివారం హిందూపురంలో జేవీఎస్ ఫంక్షన్ హాల్లో నీటిప్రాజెక్టుల భవిష్యత్తుపై జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సదస్సులో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని తన అభిప్రపాయాలను వినిపించారు. ఈమేరక సీమ ప్రాంతాలకు హంద్రీనివా నుంచి కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించే దఖలాలు కనిపించడం లేదని ఆరోపించారు. సీమ అభివృద్ధికి నాటి దివంగత ముఖ్యమంత్రి ఎన్టి.రామారావు విశేష కృషి చేశారని, ఆయన కృషి ఫలితంగానే సీమకు హంద్రీనావా ప్రాజెక్టు వచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వానికి హంద్రీనీవా ద్వారా సీమకు నీరు ఇచ్చే యోచనలేదని, ప్రాంతాల మధ్య కులమతాల చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సీమలోని కరువు మండలాలకు నీరు అందించే పథకాలను సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు కృష్ణా నిరకర జలాలను ఇవ్వకుంటే అవసరమైతే ఢిల్లీలో పోరాడేందుకైనా సిద్ధమని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు.