PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాటుసారా స్వాధీనం.. బైక్ సీజ్

1 min read

 పల్లెవెలుగువెబ్, ఓర్వకల్ : కర్నూలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కె.వి మహేష్   ఉత్తర్వుల మేరకు కర్నూలు రూరల్ సర్కిల్ సీఐ  శ్రీనాథ్ రెడ్డి  ఆధ్వర్యంలో  ఓర్వకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మల్లికార్జున సిబ్బందితో కలిసి  ఓర్వకల్లు మండలములోని కాల్వబుగ్గ క్రాస్ వద్ద ఆదివారం   నాటుసారా  విక్రయిస్తున్న మాలావత్ తిరుమల నాయక్​ను అరెస్టు చేశారు. ఓర్వకల్లు మండలం గుడుంబాయితండాకు చెందిన తిరుమల నాయక్​ నుంచి 10 లీటర్ల నాటుసారా, బైక్​ (నెంబర్ AP 27 BJ 5429)   ను  సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు.  మండలంలో నాటుసారా, మట్కా,  పేకాట లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  రైడ్ లో  ఎస్ఐ మల్లికార్జున తో పాటు ఓర్వకల్  పోలీసులు మద్దిలేటి,  రంగన్న పాల్గొన్నారు.

About Author