PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

3 రాష్ట్రాలు…2 కోట్లు..

1 min read

నకిలీ పత్తి విత్తనాలు, కవర్లు స్వాధీనం
– ముగ్గురి అరెస్టు…
– వివరాలు వెల్లడించిన ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: మూడు రాష్ట్రాలలో నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తూ.. రైతులను మోసం చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ డా.ఫక్కీరప్ప తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 2 కోట్లు విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు, కవర్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఎస్పీ కార్యాలయం ఆరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నకిలీ పత్తి విత్తనాలను , బ్రాండెడ్ కంపెనీల పేరు పై నకిలీ ఖాళీ పత్తి విత్తనాల ప్యాకెట్ల కవర్లను తయారు చేసి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆదోని తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆరేకల్లు వద్ద బైలుప్పల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, తిమ్మప్పను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1,400 నకలి పత్తి విత్తనాల పల్లవి బ్రాండ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత ఆదోని DSP వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆదోని తాలుకా సర్కిల్ సిఐ పార్ధసారథి , ఎస్సైలు ఆదోని తాలుకా పిఎస్ ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి, పెద్దతుంబళం ఎస్సై చంద్ర మరియు సిబ్బంది స్పెషల్ టీమ్ గా ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ కు వెళ్ళి చర్లపల్లి వద్ద అనధికారికంగా వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల పేర్లు మరియు లోగో లపై తయారు చేస్తున్న నకిలి పత్తి విత్తనాల, పురుగు మందుల, గుట్కా, పాన్ మసాలాల, టీ, డిటర్జెంట్లు మరియు పలు రకాల బ్రాండ్లకు చెందిన నకిలీ ఖాళీ ప్యాకెట్ కవర్ లను, తయారీకి వినియోగించిన 683 సిలిండర్లను, తయారీ యంత్రములు మరియు ముడి సరకు సామాగ్రిని స్వాధీనం చేసుకొని CEO సురేష్ ను అరెస్టు చేశారు. నకిలీ పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాల కవర్ల విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని ఎస్పీ డా. ఫక్కీరప్ప వెల్లడించారు.

రైతులు.. బిల్లు తీసుకోవాలి.. ఎస్పీ
రైతులు ఆధీకృత షాపులలోనే విత్తనాలను, ఎరువులను కోనుగోలు చేయాలని బిల్స్ మరియు ఇన్వాయిస్ లేకుంటే అటువంటి నకిలీ బ్రాండ్స్ ని ప్రవేట్ వ్యక్తుల వద్ద కొనద్దని ఎస్పీ డా. ఫక్కీరప్ప కోరారు. CEO సురేష్ మీద ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రం లో కొడంగల్​ మరియు దౌలతాబాద్ స్టేషన్ లలో మరియు ఇతర పోలీసు స్టేషన్ లలో చాలా కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటక రాష్ట్రం లో అరుణోదయ బ్రాండ్ పేరు మీద కూడా నకిలీ ప్రత్తి విత్తనాలను విక్రయించారు.ఈ ముద్దాయి పై PD Act నమోదు చేస్తున్నామన్నారు. సమావేవంలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ రాధాక్రిష్ణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వర్ రెడ్డి, ఆదోని తాలుకా సిఐ పార్ధసారధి ,ఆదోని తాలూకా ఎస్సై నరేంద్రకుమార్ రెడ్డి, పెద్ద తుంబళం ఎస్సై చంద్ర తదితరులు ఉన్నారు.

About Author