PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

13 క్వింటాళ్ల అక్రమ రవాణా బియ్యం పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, పెద్దకడబూరు : కర్నూలు జిల్లాపెద్దకడుబూరు మండలంలోని కొత్తగొల్లలదొడ్డి గ్రామ ఊరి బయట గల, శ్రీ మరెమ్మ గుడి దగ్గర అక్రమంగా బియ్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్​ఐ శ్రీనివాసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎమ్మిగనూరు మండలం సొగనూరుకు చెందిన బోయ రామాంజనేయులు, ఎమ్మిగనూరు పట్టణంలోని శక్తి నగర్​కు చెందిన బోయ వీరేష్​ అనే వ్యక్తులు 36 సంచులలో 13 క్వింటాళ్ల పీడీఎఫ్​ బియ్యంను ఆటో(ALFA ఆటొ నెంబర్ AP21TB2069)లో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి పట్టుకుని, అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి… బియ్యం స్వాధీనం చేసుకుని ఆర్​ఐ ఆదాముకు అప్పగించారు. దాడిలో తలారి నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ విక్టర్ బాబు, మరియు కానిస్టేబుల్ రంగముని పాల్గొన్నారు.

About Author