732 మద్యం బాటిళ్ల పట్టివేత .. రెండు వాహనాలు సీజ్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు అంతరాష్ట్ర సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద బుధవారం తెల్లవారు జామున భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్నారు. సెబ్ సీఐ మంజుల, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ నాయక్ తమ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియో వాహనం (AP 16AM 7557) తెలంగాణ నుంచి నిలిపి తనిఖీ చేశార. అందులో 12 కార్టన్ లలో 576 తెలంగాణ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా తెలంగాణ వైపు నుండి ఫోర్స్ Trump ట్రాలీ వాహనము( AP 04 Y 2713 ) తనిఖీ చేయగా 7 కార్టన్ లలో 156 తెలంగాణ మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. కర్నూల్ పట్టణం లోని లక్ష్మి నగర్ కు చెందిన నూర్ అహమ్మద్ తెలంగాణ రాష్ట్రం గద్వాల్ నుండి తరలిస్తున్నాడు. మొత్తం 732 మద్యం బాటిళ్లు విలువ రూ. లక్ష 50వేలు ఉంటుంది. మద్యం బాటిళ్లు, రెండు వాహనాలను కర్నూలు సెబ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ ఖాజా,,జగన్నాథం,కానిస్టేబుళ్లు శ్రీను వాసులు,మధుసూదన్, ఎస్పీఓ లు రంగ స్వామి,పరశు రాముడు లు పాల్గొన్నారు.