NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత

1 min read

వ్యక్తి అరెస్టు – వాహనం సీజ్

పల్లెవెలుగు వెబ్  మంత్రాలయం:  కర్ణాటక నుండి అక్రమంగా ఆంధ్ర కు కర్ణాటక మద్యం తీసుకుని వస్తుండగా  వ్యక్తిని పట్టుకుని మద్యం స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించిన సంఘటన  మంత్రాలయం మండలం మాధవరం లో ఆదివారం చోటు చేసుకుంది. మాధవరం ఎస్సై కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఆదోని పట్టణానికి చెందిన బందే అలీ అనే వ్యక్తి  కర్ణాటక నుండి ఆంధ్ర కు వాహనంలో 25 బాక్స్ లలో 2400 ఒరిజినల్ ఛాయిస్ విస్కీ టెట్రా పాకెట్స్ లను తీసుకుని వస్తుండగా మాధవరం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో కర్ణాటక మద్యం గుర్తించి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు.  మద్యం ను స్వాదినం చేసుకుని వ్యక్తి ని అరెస్టు, వాహనం సీజ్ చేసినట్లు ఎస్సై కృష్ణ మూర్తి తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు వీరాంజనేయులు, భాస్కర్, వీరేష్ లు ఉన్నారు.

About Author