NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారీగా అక్రమ మద్యం పట్టివేత..

1 min read

గోవాకు చెందిన 24 పూల్ బాటిళ్ళు ,29 క్వాటర్ బాటిల్లాను సీజ్ చేసిన వెలుగోడు పోలీసులు

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  ఎస్ఐ  భూపాలుడు.ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మరియు రాబడిన సమాచారం ఈ రోజు అనగా 06.03.2024 వ తేదీన ఉదయం 10.00 గంటలప్పుడు వెలుగోడులోని చెంచు కాలనీ నందు కింద తెల్పిన ముద్దాయిలు అక్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా వివిద రకాల మద్యం బాటిల్లు మొత్తం 24 పూల్ బాటిళ్ళు ,29 క్వాటర్ బాటిల్లాను నిన్నటి దినం రాత్రి తెచ్చుకొని, ఈ రోజు ఉదయం 10.00 గంటలప్పుడు వెలుగోడులోని చెంచు కాలనీ నందు A 1 ముద్దాయి ఇంటి దగ్గర ఉండి మద్యం అమ్ముతుండగా పంచాయితీదారుల సమక్షంలో పట్టుకొని అరెస్టు చేసి వారి నుండి గోవా రాష్ట్రానికి చెందిన మొత్తం 53 మద్యం బాటిళ్లను స్వాదినం చేసుకోని  CR NO.  32/2024   U/S  34 (A ) AP Excise Act కేసు నమోదు చెయ్యడమైనది .  సదరు ముద్దాయిలను విచారించగ వారు ఎలాంటి పని చెయ్యక తమకు ఉన్న ఆర్థిక పరిస్తితుల కారణంగా గ్రామంలో డబ్బులు అడుక్కొని బ్రతుకుతూ వచ్చిన డబ్బులు సరిపోక ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో కొన్ని రోజుల కిందట నంద్యాల నుండి రైలు ఎక్కి గోవా వెళ్ళి అక్కడ ఎవ్వరూ తెలిసినవారు ఉండరు అని అక్కడ డబ్బులు అడుక్కొని వచ్చిన డబ్బులతో గోవాలో మద్యం కొనుగోలు చేసి అక్కడి నుండి రైలు మార్గం ద్వారా నంద్యాల కు వచ్చి అక్కడి నుండి వెలుగోడు వచ్చేవారని తెలిసింది . పట్టుబడిన స్థలం వెలుగోడు చెంచు కాలనిముద్దాయిలు

1). గండికోట రామచంద్రుడు , వయస్సు 62 సం.లు,   S/o వెంకటయ్య  , చెంచుకాలని , వెలుగోడు గ్రామం మరియు మండలము.   2).షేక్ మాబున్ని w/o షెక్సవలి ,వయస్సు 25 సంలు ,సి‌పి నగర్ ,వెలుగోడు గ్రామం మరియు మండలం వెలుగోడు మండల ప్రజలకు తెలియ జేయడం ఏమనగా చట్ట విరుద్దంగా ఎలాంటి అనుమతి లేకుండా మద్యం అమ్మడం కానీ రవాణా చెయ్యడం కానీ చేసినయడల వారి పైన చట్టపరమైన చర్య తీసుకుంటామని తెలియజేయడమైనది  మరియు ప్రజలు పోలీస్ వారికి సహకరించి ఎలాంటి సమాచారం ఉన్న పోలీస్ వారికి చెప్పవచ్చు  , చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును .

About Author