రాయచోటిలో అంతర్జాతీయ ఫోన్ కాల్స్ వాయిస్ ఓవర్ దొంగల పట్టివేత
1 min read– 159 సిమ్ కార్డులు, ఒక లాప్ టాప్, 3 సిమ్ కార్డ్స్ బాక్సెస్ స్వాధీనం
– వివరాలు వెల్లడించిన డి.ఎస్.పి శ్రీధర్
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : కడప జిల్లా రాయచోటి పట్టణంలోని గున్నికుంట్ల రోడ్డు అల్తాఫ్ కళ్యాణమండపం సమీపంలో శ్రీలక్ష్మి అపార్ట్ మెంట్ లో గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న అంతర్జాతీయ డేటా కాల్స్ వాయిస్ ఓవర్ ముఠా వ్యవహారాన్ని మంగళవారం రాయచోటి పోలీసులు రట్టు చేశారు.డీఎస్పీ శ్రీధర్ కథనం మేరకు వివరాల్లోకి వెళితే రాయచోటి పట్టణానికి చెందిన షేక్ అమీర్ భాష కుమారులు షేక్ ముజాహిద్ భాష,సలీం మాలిక్ లు గల్ఫ్ దేశమైన కువైట్ తో పాటు ముంబై,ఢిల్లీ నగరాలకు చెందిన కొంత మంది తో కలిసి అంతర్జాతీయస్థాయిలో డేటా కాల్స్ ను వాయిస్ ఓవర్ చేస్తూ తక్కువ ధరకు అంతర్జాతీయ కాల్స్ మాట్లాడుకునే విధంగా రాయచోటి పట్టణంలోని అల్తాఫ్ కళ్యాణ మండపం సమీపంలో శ్రీ లక్ష్మీ అపార్ట్మెంట్ లో 203 గదిలో లాప్ టాప్ తో పాటు ఇతర ఇంటర్నెట్ సామాగ్రిని ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో కాల్స్ చేయిస్తూ టెలికం శాఖకు లక్షల రూపాయలు నష్టం కలిగిస్తున్న నిందితుల సమాచారం తెలుసుకున్న రాయచోటి డిఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో అర్బన్ సీఐ రాజు,ఎస్సైలు నరసింహారెడ్డి,ఎన్.ఎం.డి రఫీలు మెరుపు దాడులు చేపట్టి ముద్దాయిలు ముజాహిద్ భాష,సలీం మాలిక్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 159 సిమ్ కార్డ్స్,ఒక ల్యాప్ టాప్,3 కార్డ్స్ బాక్స్ స్ స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ జరిగిన మీడియా సమావేశంలో డి.ఎస్.పి శ్రీధర్ నిందితుల వివరాలను వెల్లడించారు.