PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అత్యధిక వేతనంకు ఎంపికైన..శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు

1 min read

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కేంద్రంలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల  విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక వేతనానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ M.సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ బుధవారం నాదు  పాన్ ఇండియా సంస్థ అయినా గ్రీఫీయో టెక్నాలజీస్ ప్రతినిధులు టెక్నికల్ వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ వర్చువల్ విధానంలో నిర్వహించి 16 మంది విద్యార్థినీ విద్యార్థులను టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్లు  గా  ఎంపిక చేసుకున్నారని వివరించారు. కళాశాలలో  కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుండి 9 మంది ,ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం నుంచి 6 మంది మెకానికల్ విభాగం నుండి e నుండి ఒక విద్యార్థి ఎంపికయ్యారని అని తెలియజేశారు .ఎంపికైన విద్యార్థులకు 4.8 లక్షల వార్షిక వేతనం మరియు ఇతర అలవెన్సులు ఉంటాయని తెలియజేశారు. డాక్టర్ ఎం. సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ  కళాశాలలో అర్థమెటిక్, రీజనింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి అంశాలపై అందిస్తున్న ప్రత్యేక శిక్షణ  తోనే  నాలుగవ సంవత్సరం చదువుతున్న సమయంలోనే  ఎంపిక కావడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. .కళాశాలలో ప్రతి విద్యార్థిని విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పించడమే ద్యేయంగా కళాశాల యందు మౌలిక వసతులు కల్పించి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు .ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి .బాలాజీ గారు ,కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాధిపతి సుభహాన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాధిపతి కే. చంద్రశేఖర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి పీ శ్రావణ్  ప్లేస్మెంట్ అధికారి కొత్తపల్లి ఇంతియాజ్,  వివిధ విభాగాల అధిపతులు మరియు  అధ్యాపకులు అభినందించారు.

About Author