దివ్యాంగుడు వజ్ర సేవకు ఎంపిక హర్షనీయం
1 min read– సంక్షేమ సారథులు వాలంటీర్లు
పల్లెవెలుగు వెబ్ మిడతూరు: మిడుతూరు మండల కేంద్రంలోని మిడుతూరు సచివాలయ ప్రాంగణంలో మిడుతూరు,పీరు సాహెబ్ పేట గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న వాలంటీర్లకుసోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ విద్యా పోగుల జయ లక్ష్మమ్మ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తువ్వా శివరామకృష్ణారెడ్డి,ఎంపీటీసీ దేవమ్మ,ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో భాగంగా వజ్ర సేవా పురస్కారానికి మిడుతూరు గ్రామానికి చెందిన సయ్యద్ అజ్మద్దీన్-30వేలు,సేవా రత్న కు మిడుతురుకు చెందిన సామక్క-20వేలు,మిగతా 34 మంది వాలంటీర్లకు సేవా మిత్ర-10వేలు వారి వారి అకౌంట్లో జమ అవుతుంది. వాలంటీర్లను అందరిని శాలువా వేసి ఘనంగా సత్కరించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కటిని కూడా ప్రజల దరికి చేర్చేది వాలంటీర్లేనని అధికారులకు ప్రజలకు మధ్యవర్తిగా వాలంటీర్లు ఉంటూ ఉండడం వలన పథకాలు సులువుగా వారి దరికి చేరుతున్నాయని,మీరు బాగా కష్టపడినట్లైతే వజ్ర సేవాకు ఎంపిక అవుతారంటూ ముఖ్య అతిథులు తెలియజేశారు.మిడుతూరుకు చెందిన అజ్మద్దీన్ వజ్ర సేవకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని మాజీ ఏఎంసీ చైర్మన్ శివరామకృష్ణారెడ్డి అన్నారు.ఈకార్యక్రమంలో ఏఓ దశరథరామయ్య,పంచాయతీ కార్యదర్శులు సుధీర్,వినోద్,కేశావతి,వెల్ఫేర్ అసిస్టెంట్ దాసరి మధు,సర్వేయర్ సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.