ఎస్ ఐగా అరవ సిద్ధారెడ్డి ఎంపిక… ఫస్ట్ ర్యాంకు
1 min readరాయలసీమ జూన్ పరిధిలో నాలుగో ర్యాంకు
కడప జిల్లా పరిధిలో ఫస్ట్ ర్యాంకు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ప్రతిరోజు వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ తల్లిదండ్రులు కష్టపడి బిడ్డను చదివించుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు నిలబెట్టిన చెన్నూరు భవాని నగర్ కు చెందిన అరవ సిద్ధారెడ్డి 20 23 బ్యాచ్ లో ఎస్ ఐగా ఎంపికయ్యారు. రాయలసీమ జోన్ పరిధిలో సెలక్షన్లో సిద్ధారెడ్డి నాల్గవ ర్యాంకు సాధించారు. కడప జిల్లా పరిధిలో ఫస్ట్ ర్యాంకు సాధించారు. అరవ సిద్ధారెడ్డి పదో తరగతి వరకు చెన్నూరు ఆర్ఆర్ స్కూల్ నందు 2014లో పూర్తి చేశారు. ఇంటర్ కడప నారాయణ జూనియర్ కళాశాలలో 2016లో పాసయ్యారు. డిగ్రీ బిఎస్సి కడప శ్రీహరి డిగ్రీ కళాశాలలో 2019లో పూర్తి చేశారు. ఎమ్మెస్సీ కడప శ్రీహరి డిగ్రీ కళాశాలలో 2021 పూర్తి చేశారు. ఎస్ ఐ పోస్టు దక్కించుకోవాలన్న లక్ష్యంతో కడప వెంకట సాయి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారు. అనుకున్న లక్ష్యంతో 20 23 ఎస్ఐ ఫలితాల్లో విజయం సాధించారు. సిద్ధారెడ్డి తల్లిదండ్రులు అరవ సుబ్బరాయుడు . అరవ సీతమ్మ. కొన్ని సంవత్సరాల కిందట తండ్రి అరవ సుబ్బరాయుడు అనారోగ్య కారణాలవల్ల మృతి చెందడం జరిగింది. సిద్ధారెడ్డికి ఇద్దరూ అక్కగారు ఉన్నారు. తల్లి అక్కగారు ప్రోత్సాహం బంధువుల ప్రోత్సాహం ఉంటూ వచ్చింది. ఎస్ఐ ఫలితాల్లో విజయం సాధించడం పట్ల సిద్ధారెడ్డి చదివిన ఆర్ఆర్ పాఠశాల. నారాయణ జూనియర్ కళాశాల. శ్రీహరి డిగ్రీ కళాశాల. వెంకట సాయి కోచింగ్ సెంటర్. యాజమాన్యం విద్యార్థులు చెన్నూరు కు చెందిన గ్రామస్తులు బంధువులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.