హొళగుంద మర్చెంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎంపిక
1 min readఇతరుల వద్దు స్థానిక వ్యాపారులే ముద్దు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : మార్చి-స్తానికేతర వ్యాపారుల వల్ల సొంత గ్రామ వ్యాపారులు నష్టపోకూడదన్నదే మా లక్ష్యమని హొళగుంద మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిష్ మంజు,ఎస్ఎస్వి షబ్బీర్, ఎస్కేఎస్ గోపాల్ తదితరులు అన్నారు.ఈ సందర్భంగా సాయంత్రం స్థానిక రవి కాంప్లెక్స్ నందు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి స్థానిక వ్యాపారులు స్థానికేతర వ్యాపారుల వల్ల పడుతున్న ఇబ్బందులను తెలియపరిచారు. అందుకోసమే హొళగుంద మర్చంట్ అసోసియేషన్ తరపున ఒక కమిటీని ఏర్పాటు చేసి రాబోయే కాలంలో స్థానికేతరులు అనగా రాజస్థాన్ గుజరాతీలు తదితరు ఉత్తర భారత దేశంలోని వ్యాపారుల వల్ల తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇతరులు వద్దు – స్తానికులే ముద్దు అంటూ హొలగుంద మర్చంట్ అసోసియేషన్ను రిజిస్ట్రేషన్ చేయించి అందులో కమిటీని ఏర్పాటు చేశామన్నారు.హోళగుంద మర్చంట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు…గౌరవ అధ్యక్షులుగా కాళికా ప్రసాద్, అధ్యక్షులుగా డిష్ మంజు, వైస్ ప్రెసిడెంట్ గా ఎన్ సి మంజునాథ్, సెక్రటరీగా కాకి శ్రీరాములు, జాయింట్ సెక్రటరీగా ఎస్కేఎస్ గోపాల్ శెట్టి, ట్రెజరర్ గా షాలి షబ్బీర్, లతోపాటు ఈసీ మెంబర్లు గా అమరేశప్ప, జాంటీ వీరేష్, ఇమామ్ భాష, గాజుల భాష, యూనూస్ ,సతీష్ మార్వాడి, వెంకన్న శెట్టి, రాము, రామ్మోహన్, రాజ్కుమార్, పత్తారి శీను, ముజామిల్, ఇర్ఫాన్ ,తదితరులను ఈసీ మెంబర్లుగా కమిటీలో చేర్చామన్నారు.అనంతరం నూతన కమిటీ మెంబర్లుగా ఎన్నికైన వారందరినీ శాలువాలతో పూలమాలతో ఘనంగా సత్కరించారు.