క్రీడలతోనే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక డిఎస్ఏ అవుట్డోర్ స్టేడియం నందు విలువిద్య క్రీడాకారులకు బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ శంకర్ శర్మ, గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ సెపక్తక్రా ప్లేయర్ పవన్. గత 20 రోజులుగా వేసవి విలువిద్య శిక్షణ శిబిరంలో విలువిద్యలో శిక్షణ తీసుకున్న క్రీడాకారులకు పోటీలు నిర్వహించడం జరిగినది. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రధానం చేసిన డాక్టర్ శంకర్ శర్మ. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ క్రీడలతోనే విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కె. నాగరత్నమయ్య, భరత్, బాలాజీ రెడ్డి, రాజు, క్రీడాకారుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.గెలుపొందిన క్రీడాకారులు అభినయ, మను శ్రీ, కృష్ణప్రియ, అన్విత, నందన, ప్రణవి, నిహాల్, కుషాల్, సాత్విక్, తేజ్ వేర్, మాన్విత్, గగన్ మొదలైన క్రీడాకారులకు బహుమతులు మొదలైన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.