కరాటేతో ఆత్మరక్షణ : మాస్టర్ రాంబాబు
1 min readపల్లెవెలుగు వెబ్: పిల్లలు చిన్నప్పటి నుంచే కరాటే సాధన చేయడం వల్ల ఆత్మరక్షణతోపాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు కరాటేమాస్టర్ రాంబాబు. ఆదివారం కర్నూలు నగరంలోని రవీంద్ర భారతి స్కూల్లో చిన్నారులకు బెల్ట్ గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు. కరాటే పోటీలలో చిన్నారులు ప్రదర్శిందిన ప్రతిభ ఆధారంగా ఎల్లో, ఆరంజ్, గ్రీన్, బ్రౌన్, బ్లాక్ బెల్టులను మాస్టర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ రాంబాబు మాట్లాడుతూ చిన్నారుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించడానికి మార్షల్ ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శిక్షణలో భాగంగా చిన్నారులకు యోగా, మెడిటేషన్ కూడా నేర్పుతామన్నారు.కార్యక్రమంలో కరాటే మాస్టర్లు, పవన్, వెంకటేష్, కేదేశ్, బాషా తదితరులు పాల్గొన్నారు.