NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భ‌ర్త‌తో భార్య‌కు సెమెన్ అల‌ర్జీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: భర్తతో శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ భార్య యోని వద్ద విపరీతమైన దురద, మంటతో బాధపడుతున్న అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సమస్యను ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ యువదంపతులు హైదరాబాద్‌కు వచ్చి పరీక్షలు చేయించుకోగా.. భార్యకు ఉన్న ‘సెమెన్‌ (వీర్య) అలర్జీ’ గురించి బయటపడిం ది! వారికి నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. సంతానం కోసం కోరుకున్నా పిల్లలు పుట్టకపోవడంతో సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయించారు. అక్కడి వైద్యులు వారికి చికిత్స చే సినా ఉపయోగం లేకపోవడంతో.. అమెరికాలోని తమ బంధువైన ఒక డాక్టర్‌ను సంప్రదించారు. దీంతో ఆయన.. ఇది ‘సెమెన్‌ ఎలర్జీ’ అయి ఉండొచ్చని అనుమానించి హైదరాబాద్‌లోని అశ్వనీ అలర్జీ సెంటర్‌కు పంపారు. అక్కడ.. అలర్జీ ఇమ్యూనాలజిస్ట్‌ డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌ వారిని ప్రశ్నించగా.. భర్తతో కలిసిన ఐదారు గంటల తర్వాత ఆమె యోని, తొడల వద్ద దు రద, దద్దుర్లు వస్తున్నాయని, జ్వరం కూడా వస్తోందని చెప్పారు.

                                        

About Author