లంచం అడిగితే ఆడియో, వీడియో తీసి పంపండి : సీఎం
1 min read
పల్లెవెలుగువెబ్ : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భగత్ సింగ్ బలిదాన్ దివస్ మార్చ్ 23న అవినీతికి వ్యతిరేకంగా హెల్ప్‌లైన్ నెంబర్ జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు అది తన పర్సనల్ వాట్సాప్ నెంబర్ అవుతుందని ప్రకటించారు. ఎవరు లంచం అడిగినా వెంటనే వీడియో, ఆడియో రికార్డ్ చేసి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవినీతిపరుల అంతుచూస్తామని మాన్ హెచ్చరించారు. పంజాబ్ ప్రజల హితం కోసమే ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు ఆయన పంజాబ్ చరిత్రలో ఇంతకుమునుపెవ్వరూ తీసుకోని సంచలన నిర్ణయం ప్రకటించబోతున్నానంటూ ట్వీట్ చేసి ప్రకంపనలు రేపారు.