NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు మృతి…

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు గ్రామానికి చెందిన సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మంగలి మల్లికార్జున(46) సోమవారం ఉదయం మరణించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఈ మధ్యనే ఇంటికి వచ్చారని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ ఉపసర్పంచ్ తువ్వా లోకేశ్వర రెడ్డి మరియు పంచాయితీ కార్యదర్శి వినోద్ మృతుని భార్య సావిత్రికి వైయస్సార్ భీమా నగదు పదివేల రూపాయలను అందజేశారు.ఈయనకు రామ్ చరణ్(14),రేణుక(8)సంతానం ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యుల్లో మరియు బంధుమిత్రుల్లో శోధనలు మిన్నంటాయి.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.

About Author