PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి సీనియర్ నేత కాతా చంద్రారెడ్డి మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని టిడిపి సీనియర్ నాయకులు టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి చిన్నాన్న కాతా చంద్రారెడ్డి (70)అనారోగ్యంతో మృతి చెందారు.గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన స్వగృహంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న నందికొట్కూరు  టిడిపి ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి,మాండ్ర లింగారెడ్డి,మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి సోమవారం ఉదయం గ్రామానికి చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.మండలంలోని వివిధ గ్రామాల నాయకులు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

About Author