హోళీ సంబరాల్లో పాల్గొన్న టిడిపి సీనియర్ నేత
1 min read–ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు
– గిరిజన ప్రజలతో కలిసి నృత్యాలు చేసిన జగన్ రాజు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం పరిధిలోని వీరబల్లి మండలం తాటిగుంటపల్లె గ్రామ పంచాయితీలోని షికారుపాలెం తాండాలో మంగళవారం రాత్రి జరిగిన హోళీ సంబరాలల్లో గ్రామస్థుల ఆహ్వానం మేరకు టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు, ప్రముఖ విద్యావేత్త చమర్తి జగన్ రాజు హారయ్యారు. జగన్ రాజు రాక సంధర్భంగా తాండాలోని గిరిజన ప్రజలందరూ కలిసి బాణా సంచా పేల్చుతూ పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. అనంతరం టిడిపి నాయకులు, గిరిజన ప్రజలు కలిసి జగన్ రాజు దుశ్శాలువ కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గిరిజన ప్రజల సాంప్రదాయంగా జరుపుకునే సంబరాలల్లో పాల్గొని గిరిజన ప్రజల కోర్కొమేరకు జగన్ రాజు కూడా వారితో కలిసి బంజార పాటలకు నృత్యాలు చేశారు. ఈ సంధర్భంగా జగన్ రాజు మాట్లాడుతూ ప్రతి ఏటా హోళీ సంబరాలను జరుపుకోవడం ఆనవాయితీ అని అతిముఖ్యంగా గిరిజనులకు ఓ పెద్ద పండుగ హోళీ అని అన్నారు. తాను గిరిజన ప్రజలతో కలిసి హోళీ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నారు. ఆనందోత్సవాల మధ్య ఈ పండుగను జరుపుకున్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు తాను హోళీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. హోళీ సంధర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జగన్ రాజు ప్రారంభించి గిరిజన ప్రజలతో కలిసి జగన్ రాజు అక్కడే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి వీరబల్లి మండల అధ్యక్షుడు భాను గోపాల్ రాజు, బంజారా సంఘం నాయకులు విశ్వనాథ నాయక్, శంకర్ నాయక్, మైనారిటీ నాయకుడు ఇబ్రహీం, బీసీ నాయకుడు వీరబల్లి ఆంజనేయులు, గ్రామ టిడిపి అధ్యక్షుడు భాస్కర్ రాజు, వాసు దేవరాజు, చంద్ర, రాజశేఖర్, మహేంద్ర, వీరామృత నాయుడు, నాగప్ప నాయుడు, మధు, జగన్, తదితరులు పాల్గొన్నారు.