NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుండెపోటుతో వైసీపీ సీనియర్ నాయకుడు చంద్రారెడ్డి మృతి

1 min read

చంద్రారెడ్డి మృతికి సంతాపం తెలిపిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి .

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణంలోని 10వ వార్డు నందు వైసిపి సీనియర్ నాయకులు శావోలు చంద్రా రెడ్డి శనివారం  ఉదయం 5 గంటల ప్రాంతంలో గుండెపోటు తో మృతిచెందారు.విషయం    తెలుసుకున్న శాప్ చైర్మన్  బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , మున్సిపల్ చైర్మన్  దాసి సుధాకర్ రెడ్డి, యువ నాయకులు ఎక్కలదేవి చంద్రమౌళి చంద్రారెడ్డి మృతదేహానికి  పూలమాలలు వేసి సంతాపం తెలియజేస్తూ  నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రారెడ్డి మృతి వైసీపీ పార్టీకీ తీరని లోటు అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో 10వ వార్డు వైసిపి నాయకులు వి.ఆర్ శ్రీను, కౌన్సిలర్ మందడి వాణి,వైసీపీ నాయకులు   రవీంద్రా రెడ్డి, లాయర్ రఘునాథరెడ్డి, శేషి రెడ్డి, అల్వాల రామ్మూర్తి, కె.వెంకటేశ్వర్లు తదీతరులు పాల్గొన్నారు. 

About Author