ప్రత్యూష ఆత్మహత్యలో సంచలన విషయాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ హీరోయిన్‌తో ప్రత్యూష చివరిగా మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రత్యూష సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాను కోరుకున్న జీవితం ఇది కాదంటూ.. అందుకే వెళ్లిపోతున్నానంటూ సూసైడ్ నోట్‌లో ఉంది. గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ప్రత్యూష ఉన్నట్లు సమాచారం. రూమ్‌లో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని పోలీసులు గుర్తించారు. రసాయనం పొగ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. సూసైడ్ లెటర్, పెన్‌డ్రైవ్, మొబైల్‌ను సీజ్ చేశారు. కాగా ఉస్మానియా హాస్పిటల్‌లో పోస్ట్‌మార్టం పూర్తి అయింది.