NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

న‌ష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ.. లాభాల్లో బ్యాంక్ నిఫ్టీ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఉద‌యం స్వల్ప లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. అనంత‌రం న‌ష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఐటీ సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి ప్రధాన సూచీలైన సెన్సెక్స్ , నిప్టీ న‌ష్టపోవ‌డానికి ప్రధాన కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ల‌లో కొనుగోళ్లతో బ్యాంక్ నిఫ్టీ మిగిలిన సూచీల‌కు భిన్నంగా లాభాల్లో క‌దులుతోంది. అంత‌ర్జాతీయంగా యూఎస్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల్లో ఉండ‌గా.. ఏసియా మార్కెట్లు, యూరోపియ‌న్ మార్కెట్లు న‌ష్టాల‌తో ట్రేడ్ అవుతున్నాయి. మ‌ధ్యాహ్నం 1:30 నిమిషాల స‌మ‌యంలో సెన్సెక్స్ 174 పాయింట్ల న‌ష్టంతో 58,105 వ‌ద్ద .. నిఫ్టీ 51 పాయింట్ల న‌ష్టంతో 17,310 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 36,626 వ‌ద్ద ట్రేడ్ అవుతోంది.

About Author