PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర్యాగింగ్ నిరోధంపై… సెన్సిటైజేషన్ ప్రోగ్రాం

1 min read

– కళాశాలలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలి..

– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి రాజేశ్వరి

 – సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజీలో యాజమాన్యానికి, ప్రొఫెసర్లకు ర్యాగింగ్ నిరోధకంపై సెన్సి టైజేషన్ ప్రోగ్రాం..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  జి రాజేశ్వరి  దుగ్గిరాల లోని సెయింట్ జోసెఫ్ డెంటల్ మెడికల్ కాలేజీ నందు కాలేజీ యాజమాన్యానికి, ప్రొఫెసర్లకు మరియు సిబ్బందికి ర్యాగింగ్ నిరోధముపై తీసుకోవలసిన చర్యలు పైన సెన్సిటైజేషన్ ప్రోగ్రాం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  జి రాజేశ్వరి మాట్లాడుతూ  కళాశాల సిబ్బంది మరియు ఉపాధ్యాయులు ప్రొఫెసర్లు ఎప్పటికప్పుడు విద్యార్థులను గమనిస్తూ ఉండాలని వారి యొక్క ప్రవర్తన మరియు మానసిక స్థితిని గమనిస్తూ ఉండాలని జూనియర్ విద్యార్థులకు తోటి విద్యార్థుల నుండి ఏమైనా ఒత్తిడి ఉన్నదా తెలుసుకుంటూ ఉండాలని, అలాగే సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండేలాగా శిక్షణ ఇవ్వాలి, అలాగే ర్యాగింగ్ కమిటీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు, కళాశాల ప్రాంగణమునందు, క్యాంటీన్ నందు,  వీలున్న యాంటీ ర్యాగింగ్ స్లొగన్స్, సైన్ బోర్డ్స్ మరియు ర్యాగింగ్ చేయడం వల్ల జరిగే నష్టాలను తెలిపే  సైన్ బోర్డ్స్ఏర్పాటు చేయాలని అలాగే కాలేజీని ఫ్రీ ర్యాగింగ్ కాలేజీ గా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో యాజమాన్యం, సిబ్బంది విద్యార్థులు నిరంతరం కృషి చేయాలని కోరారు మరియు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాంటీ ర్యాగింగ్ కమిటీ మెంబర్స్ కూనా కృష్ణారావు, డాక్టర్ సిహెచ్. వంశీకృష్ణ, ఎల్. వెంకటేశ్వరరావు మరియు మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author