PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ‘సెర్ఫ్​..ఉన్నతి’ని.. ఎస్సీ ఎస్టీ మహిళలు సద్వినియోగం చేసుకోండి

1 min read

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు, కర్నూలు: సెర్ఫ్-ఉన్నతి మహిళలు ఎస్సీ/ఎస్టీ శక్తి ఆటో రిక్షా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ నందు ఎస్సీ మహిళలకు సెర్ప్ ఉన్నతి మహిళా శక్తి ఆటొ రిక్షా పంపిణీ  కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా  జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన మహిళలు తమకు ఆసక్తి ఉన్న వృత్తులలో రాణించిందేకు ఉన్నతి పథకం చక్కగా ఉపయోగపడుతుందని మహిళలు డ్రైవింగ్ లో ఎలాంటి భయం అంధోళన లేకుండా పురుషులతో సమానంగా రాణించాలని, మగవారికి సైతం కష్టంగా అనిపించే ఆటో డ్రైవర్ వృత్తిని ఎంచుకొని ఆత్మ స్థైర్యంతో ముందుకు సాగాలని అన్నారు. ఎస్సీ/ఎస్టీ మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ పథకం కింద వడ్డీ లేని ఋణాలు ఇస్తున్నామని, ఋణాలను తీసుకున్న వారు వాయిదా పధ్ధతిలో చెల్లించాల్సి ఉంటుందని, ఈ పథకం కింద ఉన్నతి మహిళ శక్తి ఆటో రిక్షా పేరుతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తోందని అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వైఎస్సార్  క్రాంతి పథకం మరియు డి.ఆర్.డి.ఏ, కర్నూలు వారి అధ్వర్యంలో పేద ఎస్సీ మహిళలకు ఉన్నతి (వడ్డీ లేని ఋణం) పథకం ద్వార ఆసక్తి కలిగి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మహిళలకు మొదటి విడత కింద 11 మందికి బజాజ్ ఆటోలు (9 యూనిట్లు) మరియు అప్పి ఆటోలు (2 యూనిట్లకు) పూర్తి ధరలో 90 శాతం మొత్తాన్ని ఋణంగా మంజూరు చేశారు.. 10 శాతం వాటా ధనం మహిళలు చెల్లించడం జరిగిందన్నారు. ఋణాల మొత్తం 29,40,555/- (ఇరవై తొమ్మిది లక్షల నలభై వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు) మంజూరు చేసి ఆటోలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలు తీసుకున్న ఋణాలు సక్రమంగా 48 కంతులలో చెల్లించాలని మహిళలకు సూచించారు. తదనంతరం చెక్కు కార్యక్రమం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పథక సంచాలకులు డి.ఆర్.డీ.ఏ-వైకెపి యన్.సలీం బాషా, ఎపిడి  శ్రీధర్ రావు, డిపియం (లైవ్లిహూడ్స్)  నర్సమ్మ, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సీత బాయి, జిల్లా సమాఖ్య కోశాధికారి మాధవి, జిల్లా ఉన్నతి కోఆర్డినేటర్ కాశీశ్వరుడు సంబంధిత ఏరియా కోఆర్డినేటర్లు, ఎపియం లు, ఉన్నతి మహిళా శక్తి ఆటో డ్రైవర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Author