ట్రాఫిక్ జామ్ తో తీవ్ర ఇబ్బందులు.. సమస్య ఉన్న స్పందన సున్నా
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల వాసులకు ప్రధాన సమస్యగా మారిన ఇరుకు రహదారులతో గంటలకు కొద్ది ట్రాఫిక్ జామ్ సోమవారం సాయంత్రం గడివేముల పాత బస్టాండ్ లో ద్విచక్ర వాహరదారులకు చుక్కలు చూపించింది ఒకవైపు ఆర్టీసీ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఇరుకు రహదారిలో వెళ్లలేక ఆగిపోవడం తో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది ఇప్పటివరకు ప్రధాన సమస్యపై అధికారులు రాజకీయ నాయకులు బైపాస్ రహదారి నిర్మిస్తామని మండల వాసులకు హామీ ఇవ్వలేకపోతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈసారైనా మా సమస్యలను తీర్చాలి అని గ్రామస్తులు కోరుతున్నారు.