PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెర్ప్ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి…

1 min read

రెగ్యురలైషన్ చేసి పేస్కెల్ అమలు చేయాలియని వై.కే.పై -డి.ఆర్.డి.ఏ JAC అధ్వర్యంలో 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 4586 మంది సెర్ప్ ఉద్యోగులు గత 23 సంవత్స్రాలుగా పనిచేస్తూ ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలను జగనన్న తోడు, జగన్న చేయూత, వై.యస్.ఆర్ ఆసరా, సున్నా వడ్డీ, జగనన్న పాల వెల్లువ, నాడు నేడు వంటి అనేక కార్యక్రమాలు చేస్తూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి ప్రపంచస్థాయిలో గుర్తింపుతిసుకొనిరావడంలో ఎంతో కృషి చేస్తున్నాము. ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తూ ఎంతో మంది సెర్ప్ ఉద్యోగులు ప్రాణలు కోల్పాయు వాళ్ల  ఎటువంటి ఆర్ధిక భరోసా లేకా కుటుంబాల్లు రోడ్డున్న పడ్డాయి. గత 4 సంవత్స్రాల నుండి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మా వినతి పత్రం ఇచ్చినా మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. ప్రభుత్వానికి సెర్ప్ కర్నూలు JAC నుండి మేము విన్నపం చేస్తున్నది  ఏమిటంటే సెర్ప్ లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల సిబ్బందిని రెగ్యులర్ చేసి లేదా క్యాడర్ ఫికేషన్ చేసి పీ స్కేల్ అమలు చేయమని కోరుతున్నాము, ప్రభుత్వానికి ఏమాత్రమూ బడ్జెట్ సమస్య లేనటువంటి పే ఫిక్సేషన్ తెలాంగాణ ప్రభుత్వం మా తోటి ఉద్యోగులకు పీ స్స్కేల్ ఇవ్వమని మా కోరికలను నెరవేర్చమని 23.01.2024 నుండి సమ్మె చేస్తూ 7వ రోజు కర్నూలు ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సెర్ప్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి స్వచ్చందంగా మహిళా సంఘలు , MS అకౌటెంట్లు మరియు VOA లు సంఘీభావం తెలిపి ర్యాలి లో పాల్గొని గాంధీ విగ్రహానికి వినతి సమర్పించారు. అనంతరం గౌరవ కలెక్టర్ కి స్పందన లో తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివేళ్లాలని వినతి పత్రం ఇచ్చారు.

About Author