మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి సేవలు చిరస్మరణీయం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి సేవలు చిరస్మరణీయం అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నరసమ్మ కొనియాడారు. ఇటీవల మరణించిన మాజీ ప్రిన్సిపల్ కార్డియాలజీ విభాగపు అధిపతి కీ.శే.డాక్టర్ టి రామకృష్ణారెడ్డి సంతాప సభ ఓల్డ్ సి ఎల్ జి యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కార్డియాలజీ విభాగంలో సేవలు చిరస్మరణీయమని కార్డియాలజీలో మొదటిసారిగా ఐసీయూ విభాగాన్ని ఏర్పరచారని అధునాతన చికిత్సలు నిర్వహించారని కొనియాడారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ & ప్రొఫెసర్ డాక్టర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్డియాలజీ విభాగానికి పెద్దలు మాజీ ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి సేవలు ఎప్పటికీ మరువలేమని వారి ద్వారా ఎంతోమంది వైద్య మేళకువలు నేర్చుకున్నారని అందులో తాను ఒకడి నని గుర్తు చేసుకున్నారు. కార్డియాలజీ విభాగానికి రామకృష్ణారెడ్డి వల్ల ఎన్నో అధునాతన సౌకర్యాలు కల్పించబడ్డాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కీ . శే. డాక్టర్ రామకృష్ణారెడ్డి కుమారుడు డాక్టర్ విజయకృష్ణ రెడ్డి తనతండ్రి పేరు మీద కార్డియాలజీ విభాగంలో బెస్ట్ అవుట్ గోయింగ్ పిజికి గోల్డ్ మెడల్ అందిస్తామని ఆ విభాగానికి 30 కాట్స్ అందజేస్తామని తెలిపారు. అనంతరం ఇటీవల మరణించిన వైద్య విద్యార్థిని రమ్య తేజ కు సంతాపం ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.సాయి సుధీర్, వివిధ విభాగాధిపతులు, డాక్టర్ శ్రీనివాసులు డాక్టర్ లక్ష్మి బాయి, డా .రాధారాణి,డా. రాంశివ నాయక్, డా.శ్రీనివాసులు, డిప్యూటీ సూపరెండెంట్ డాక్టర్ శ్రీరాములు, డా . డమ్మమ్ శ్రీనివాసులు వివిధ విభాగాల ప్రొఫెసర్లు అసిస్టెంట్లు అసోసియేట్లు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
