నంద్యాల లయన్స్ క్లబ్ సేవలు ప్రశంసనీయం: లయన్స్ గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్
1 min readలయన్స్ గవర్నర్ పర్యటన సందర్భంగా నాలుగు లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఆదివారం లయన్స్ జిల్లా గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్ నంద్యాల పర్యటన సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పీవీ సుధాకర్ రెడ్డి, కార్యదర్శి సోమేశుల నాగరాజు, కోశాధికారి మామిళ్ల నాగరాజు ల నిర్వహణలో,ఐ.ఎమ్. ఏ .రాష్ట్ర మాజీ అధ్యక్షుడు,లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ,లయన్స్ జిల్లా చైర్మన్, దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం.పీ.వి. రమణయ్య పర్యవేక్షణలో పట్టణంలో నాలుగు లక్షల రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు. స్థానిక స్నేహ వృద్ధాశ్రమానికి లయన్స్ యువజన విభాగం సభ్యులు కూర ప్రసాద్, రాజ్ భవన్, వంకదారి భరత్, కిషోర్ , సుహాస్ రాఘవ, పవన్, రాఘవ, డాక్టర్ శ్రవణ్ కుమార్, సందీప్, సుజిత్ రాఘవ, బొగ్గరపు పవన్ ల సౌజన్యంతో 100 కేజీల కంది బేడలు అందజేశారు. స్నేహ వృద్ధాశ్రమంలో స్వామి రెడ్డి, ఉపేంద్ర రెడ్డి ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. నంద్యాల శివార్లలో పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు ఏర్పాటుచేసిన లయన్స్ క్లబ్ స్వాగత బోర్డ్ ను లయన్స్ గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్ ఆవిష్కరించారు.మహానంది రోడ్డు లో ఉన్న ఎయిం ఫర్ సేవ బాలికల ఛాత్రాలయం లో ఉన్న 50 మంది బాలికలకు కాస్మెటిక్స్ కిట్లు, పెన్సిల్లు, పెన్నులు తదితర వస్తువుల పాఠశాల కిట్లు మేజర్ డాక్టర్ బచ్చు సంతోష్ సౌజన్యం తో అందజేశారు. తదుపరి నంద్యాల వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ సహకారంతో దివ్యాంగుల హెల్త్ కార్డులు,లయన్స్ జోన్ చైర్మన్ శ్రీరామ డిజిటల్స్ అధినేత చందా చంద్రమోహన్ సౌజన్యంతో 15 మంది దివ్యాంగులకు నెలవారి మందులు అందజేశారు.తదుపరి రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన భారీ సేవా కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు భవనాసి నాగ మహేష్,రావుస్ విద్యా సంస్థల అధినేత అప్పారావు, గురు రాజా స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి,కుంచా మహేశ్వర్ రెడ్డి,తోట శ్రీనివాస్,చింతమాని లాలి స్వామి, పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు, రవి ప్రకాష్ ,గోళ్ళ సుదర్శనం, రామన్న, సుధాకర్ రావు, వెంకటేశ్వర్లు, తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి ల సౌజన్యంతో 15 మోటార్ తో పనిచేసే కుట్టు మిషన్లు,బేకర్స్ పార్క్ అధినేత సవ్వా మనోహర్ రెడ్డి, దంత వైద్యులు డాక్టర్ రాజీవ్, బాల అకాడమీ అధినేత రవీంద్రనాథ్, ఎలుకూరు సురేష్, ఇమ్మడి వెంకట రామకృష్ణుడు,కూర ప్రసాద్ ,మల్లికార్జున, రఘు రమేష్, యాతం చంద్రమౌళీశ్వర రెడ్డి ల ఆర్థిక సహకారంతో 9 చక్రాల కుర్చీలు,బవిరిశెట్టి శ్రీకాంత్,రాయసం బాబురావు,మామిళ్ల నాగరాజు, వీరాంజనేయులు, దస్తగిరి,కుమ్మరి సురేష్,సుధీర్ కుమార్ రెడ్డి,అప్పారావు ల విరాళంతో ఎనిమిది మంది బధిరులకు వినికిడి యంత్రాలు, లగిశెట్టి విజయ్ కుమార్,శ్రీనివాస ఆప్టికల్స్ అధినేత కసెట్టి వేణుమాధవ్, నంద్యాల పట్టణ బిజెపి అధ్యక్షుడు కసెట్టి చంద్రశేఖర్, వెంకప్ప మెడికల్ స్టోర్స్ అధినేత శిరిగిరి రమేష్,మల్లికార్జున రెడ్డి, నిజాముద్దీన్, రత్నకుమార్, రావుస్ కళాశాల ప్రిన్సిపల్ రొడ్డా సుంకయ్య ల సహకారంతో 20 జతల చంక కర్రలు దివ్యాంగులకు అందజేశారు. ఇద్దరు పేద విద్యార్థులకు ఐదేసి వేల రూపాయల చొప్పున రాహుల్ ప్రింటర్స్ అధినేత చంద్ర మౌళీశ్వర రెడ్డి, యూసుఫ్ లు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గవర్నర్ నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ గత ఐదు దశాబ్దాల పైగా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్న దని ప్రశంసించారు. భవిష్యత్తులో లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేస్తామని అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి ప్రకటించారు . ఈ కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లయన్స్ సంస్థల మాజీ చైర్మన్ ఎవిఆర్ ప్రసాద్,లయన్స్ జిల్లా క్యాబినెట్ సెక్రటరీ రామరాజు,లయన్స్ సభ్యులు వివిధ సేవా కార్యక్రమాలకి సహకరించిన దాతలు పాల్గొన్నారు.